తెలుగు ప్రేక్షకులకు చేరువైన నిమిత.. పండంటి కవలలకు జన్మనిచ్చింది. ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇద్దరు మగ శిశువులకు జన్మనిచ్చినట్టు తెలిపారు. తామంతా ఆరోగ్యంగానే ఉన్నామని, అభిమానుల ఆశీస్సులు తమకు ఉండాలని కోరారు. కవలలను ఎత్తుకొని భర్తతో ఉన్న వీడియోను పంచుకున్నారు. ఒకప్పుడు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఎన్నో విజయవంతమైన చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. సొంతం సినిమాతో పరిచయమయ్యి.. వెంకటేశ్ సరసన జెమిని సినిమాలో, ఒక రాజు ఒక రాణి, ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి, నాయకుడు, బిల్లా, సింహా వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. కొన్ని కారణాల వల్ల ఈమె లావుగా మారడంతో తొలుగు అవకాశాలు తగ్గాయి. దీంతో ఆమె చెన్నైకు మకాం మార్చేసింది. తమిళం, మలయాళం, కన్నడ భాషలలో వరుస చిత్రాలు చేస్తూ బిజీగా మారిపోయింది. 2017లో కోలీవుడ్ యాక్టర్ వీరేంద్ర చౌదరిని వివాహం చేసుకుని సినిమాలకు దూరమైంది.
కాగా.. గతంలో తాను తల్లిని కాబోతున్నానంటూ బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది. తన జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుందని, మాతృత్వం మర్చిపోలేని అనుభూతినిస్తుందని పేర్కొంది. తన ముఖంలో చిరునవ్వు వచ్చిందని, ఈ రోజు కోసం ఎన్నో రోజులు వెయిట్ చేశానని తెలిపింది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.