Sonakshi Sinha: పెళ్లెప్పుడు చేసుకుంటావ్? అని అడిగిన నెటిజన్.. సోనాక్షి ఏం సమాధానం చెప్పిందో తెలుసా?

సినిమాలతో పాటు సోషల్ మీడియాలో(Social media)నూ  యాక్టివ్ గా ఉండే నటీమణుల్లో బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) ఒకరు

Sonakshi Sinha: పెళ్లెప్పుడు చేసుకుంటావ్? అని అడిగిన నెటిజన్.. సోనాక్షి ఏం సమాధానం చెప్పిందో తెలుసా?
Sonakshi Sinha

Updated on: Jan 24, 2022 | 4:14 PM

సినిమాలతో పాటు సోషల్ మీడియాలో(Social media)నూ  యాక్టివ్ గా ఉండే నటీమణుల్లో బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) ఒకరు. నిత్యం తన గ్లామరస్, ఫ్యాషనబుల్ ఫొటోలతో పాటు తన సినిమాలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. అదేవిధంగా తీరిక దొరికినప్పుడల్లా ఫ్యాన్స్ తో సరదాగా ముచ్చటిస్తుంటుంది. అలా తాజాగా ఇన్ స్టాగ్రామ్(Instagram) లో ‘ఆస్క్ మీ క్వశ్చన్’ పేరుతో ఓ ఛాటింగ్ సెషన్ ను నిర్వహించింది. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానమిచ్చింది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ‘ మేడమ్ అందరూ పెళ్లి చేసుకుంటున్నారు. మరి మీరెప్పుడూ పెళ్లిపీటలెక్కుతారు? అని అడిగాడు. దీనికి స్పందించిన సోనాక్షి ‘ అందరూ కొవిడ్ బారిన పడుతున్నారు. నేను కూడా దాన్ని పొందాలా’ అంటూ తనదైన శైలిలో సమాధానమిచ్చింది.

కాగా ఇటీవల కత్రినా కైఫ్- విక్కీ కౌశల్, రాజ్ కుమార్ రావ్- పత్రలేఖ, అంకితా లోఖండే- విక్కీ తదితరులు వరుసగా పెళ్లిపీటలెక్కారు. ఈ నేపథ్యంలోనే సోనాక్షిని వివాహం గురించి అడిగాడు నెటిజన్. కాగా సోనాక్షి సమాధానాలపై మరో నెటిజన్ ‘ మేడమ్.. మీరు ఎంతో రూడ్ గా సమాధానాలిస్తున్నారు’ అని అడగ్గా.. ‘ అలాంటిదేం లేదు.. నా సెన్సాఫ్ హ్యూమర్ ను చూపించాను’ అంతే అని చెప్పుకొచ్చింది. ఇక సినిమాల విషయానికొస్తే చివరిగా ‘భుజ్.. ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ లో కనిపించింది సోనాక్షి. ప్రస్తుతం ఆమె రితేశ్ దేశ్ ముఖ్ తో కలిసి ‘ కాకుడ’ సినిమాలో నటిస్తోంది.  అదేవిధంగా మరోనటి హ్యుమాఖురేషితో కలిసి ‘డబుల్ ఎక్స్ ఎల్’ చిత్రంలో నటిస్తోంది.

Also Read: Pragya Jaiswal: సల్మాన్‌ను మొదటిసారి కలిసినప్పుడు ఏం అడిగానంటే.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన ప్రగ్యా జైస్వాల్..

Coronavirus: కోలీవుడ్‌ ను వదలని కరోనా.. స్టార్‌ డైరెక్టర్‌ దంపతులకు పాజిటివ్‌..

Srikanth: శ్రీశైలం మల్లన్న సేవలో శ్రీకాంత్.. స్వామి వారిని ఏం కోరుకున్నారంటే..

Follow Us