f3 movie twitter review: అనిల్ రావిపూడి దర్శకత్వంలో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా, ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఎఫ్-3 (F3 movie) ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం కరోనా కారణంగా పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే చివరికి ఈ సినిమా ఇవాళ(మే 27) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయింది. ఎఫ్-2 చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఆ చిత్రానికి సీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎఫ్3పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
తమన్నా, మెహ్రీన్ పిర్జాదా, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే స్పెషల్ పార్టీ సాంగ్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తాజాగా ఈ చిత్ర ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రేక్షకులు తమ స్పందన తెలియజేస్తూ ట్విట్టర్ వేదికగా తమ స్పందనను పంచుకుంటున్నారు. ఎఫ్ 3లో కూడా నవ్వులు పండాయా? లేదా ఏకంగా ఎఫ్ 2 ని మించిపోయేలా ఉందా? అనే విశేషాలను ప్రేక్షకులు తెలియజేస్తున్నారు.
#F3Movie Review: A laughing riot.
Rating: ⭐️⭐️⭐️?1/2(3.5)
A roller coaster ride of fun and frustration.. @VenkyMama‘s comic timing is perfect, he is the soul of the movie. @IAmVarunTej is excellent. Overall #F3 is a complete entertainment package.. #F3MovieReview pic.twitter.com/iG93envC0V— Sushil sinha (@SushilSinha_108) May 27, 2022
#F3Movie review from USA@AnilRavipudi you are Safe.
Average First half. Cringy in Parts. Bad Music and Songs??, But a hilarious Second half?? made this a HIT. @VenkyMama One man Show. Climax worked so well. @DilRajuOff_ #F3 @tamannaahspeaks pic.twitter.com/TMtATM7Xrf— Pradyumna Reddy (@pradyumna257) May 27, 2022
F3 Movie Twitter Review: Comedy shocked but it happened again as expected .. F2 is better .. https://t.co/CtkJQH4JqH
— Cinema Road (@CinemaRoaddotin) May 27, 2022
ఎఫ్-3 సినిమా ప్రారంభంలో చకచకా క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ జరిగిపోయిందని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ చిత్రంలో వెంకటేష్ రేచీకటి ఉన్న వ్యక్తిగా, వరుణ్ తేజ్ నత్తి ఉన్న యువకుడిగా కనిపిస్తారు. ఎప్పటిలాగే వెంకీ మామ కామెడీ టైమింగ్‌తో అదరగొట్టేశాడని టాక్. వరుణ్ తేజ్ కూడా తనదైన స్టైల్‌లో నవ్వులు పూయించాడట. వీరి ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బనవ్విస్తుందని ప్రేక్షకులు చెబుతున్నారు. ఇక సునీల్‌ని చాలా కాలం తర్వాత కంప్లీట్ కామెడీ రోల్‌లో చూడడం సంతోషంగా ఉందని ఫ్యాన్స్ అన్నారు. ఫస్ట్ హాఫ్‌లో ఫన్ సీన్స్ పడినప్పటికీ.. స్టోరీ పరంగా చూస్తే అంత ఆసక్తికరంగా ఉన్నట్లు అనిపంచదు.
ఐతే వరుస ఫన్ సీన్స్ నవ్విస్తుండటం మూలంగా.. స్టోరీని పక్కన పెట్టి కంప్లీట్‌గా ఎంజాయ్ చేసే కుటుంబ చిత్రమని ప్రేక్షకులు ట్విటర్ ద్వారా పేర్కొంటున్నారు. ఐతే కొందరేమో సినిమా యావరేజ్‌గా ఉందని పోస్టులు పెడుతున్నారు. కొన్ని కామెడీ సీన్స్ మాత్రమే వర్కౌట్ అయ్యాయని అంటున్నారు. క్లైమాక్స్ సీన్‌లో వెంకీ, వరుణ్ కామెడీ టైమింగ్ అదిరిపోయిందని మరికొందరంటున్నారు. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, సునీల్, అలీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఎనర్జిటిక్ మ్యూజిక్‌ను అందించారు.