Dulquer Salmaan: బృందా మాస్టర్‌ మొదటి సినిమా.. దుల్కర్‌ ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది.. సినిమా విడుదల ఎప్పుడంటే..

|

Dec 21, 2021 | 9:44 PM

ఆమీర్‌ ఖాన్‌ 'పీకే', విజయ్‌ 'తేరీ' (తెలుగులో పోలీసోడు) తదితర హిట్‌ చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించిన బృందా మాస్టర్‌ మెగాఫోన్‌ పట్టుకున్న సంగతి తెలిసిందే. మొదటి అవకాశంలోనే ఏకంగా మలయాళ స్టార్​ నటుడు దుల్కర్​ సల్మాన్‌ను డైరెక్షన్‌ చేసే

Dulquer Salmaan: బృందా మాస్టర్‌ మొదటి సినిమా.. దుల్కర్‌ ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది.. సినిమా విడుదల ఎప్పుడంటే..
Follow us on

ఆమీర్‌ ఖాన్‌ ‘పీకే’, విజయ్‌ ‘తేరీ’ (తెలుగులో పోలీసోడు) తదితర హిట్‌ చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించిన బృందా మాస్టర్‌ మెగాఫోన్‌ పట్టుకున్న సంగతి తెలిసిందే. మొదటి అవకాశంలోనే ఏకంగా మలయాళ స్టార్​ నటుడు దుల్కర్​ సల్మాన్‌ను డైరెక్షన్‌ చేసే అవకాశం దక్కించుకుంది. ఆ సినిమా పేరే ‘హే సినామిక’ కాజల్‌ అగర్వాల్‌, అదితీరావ్‌ హైదరీ లాంటి స్టార్‌ హీరోయిన్లు ఈ సినిమాలో నటిస్తున్నారు. రొమాంటిక్‌ అండ్‌ కామెడీ ఎంటర్‌ టైనర్‌గా పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కాగా ఈ సినిమాలోని దుల్కర్‌​ ఫస్ట్​లుక్​ పోస్టర్​ మంగళవారం విడుదలైంది. దీంతో పాటు సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు.

కాగా తెలుగులో అక్కినేని నాగార్జున, తమిళంలో సూర్య, మలయాళంలో నజ్రియా-ఫాహద్​ దుల్కర్‌ ఫస్ట్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఎంతో కలర్‌ఫుల్‌గా ఉన్న ఈ పోస్టర్‌లో దుల్కర్‌ కూడా వివిధ రకాల గెటప్పుల్లో కనిపించి ఆకట్టుకుంటున్నాడు. ఈ సినిమాలో దుల్కర్‌ రేడీయో జాకీగా కనిపించనున్నాడని సమాచారం. జియో స్టూడియోస్, గ్లోబల్​ వన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా 2022 ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదలకానుంది. కాగా బృందాతో పాటు పలువురు మహిళా ప్రముఖులు ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారు. ప్రీతిజయరామన్‌ సినిమాటోగ్రాఫర్‌గా, రాధా శ్రీధర్‌ ఎడిటర్‌గా ఈ సినిమాలో భాగమవుతున్నారు.

Sandeep Reddy: పుష్ప సినిమాను వీక్షించిన అర్జున్ రెడ్డి డైరెక్టర్.. బన్నీ గురించి ట్విట్టర్‌లో ఏం చెప్పారంటే..

Bheemla Nayak: పవన్ ఫ్యాన్స్ కు షాక్ !! పవన్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే ?? లైవ్ వీడియో

ఈ చిన్నోడు ఇప్పుడు అమ్మాయిల ఫేవరెట్ హీరో.. ఈ ఓవర్ నైట్‏ స్టార్‏ను గుర్తుపట్టారా ?..