వివాదంలో దుల్కర్‌, పృథ్వీ.. దోషులుగా తేలితే జైలు శిక్ష..!

మలయాళ యువ నటులు దుల్కర్ సల్మాన్‌, పృథ్వీరాజ్‌లు వివాదంలో చిక్కుకున్నారు. సాధారణ రోడ్డుపై వీరి కార్లు రేసింగ్‌కి పాల్డడినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

వివాదంలో దుల్కర్‌, పృథ్వీ.. దోషులుగా తేలితే జైలు శిక్ష..!

Edited By:

Updated on: Jul 24, 2020 | 6:28 PM

మలయాళ యువ నటులు దుల్కర్ సల్మాన్‌, పృథ్వీరాజ్‌లు వివాదంలో చిక్కుకున్నారు. సాధారణ రోడ్డుపై వీరి కార్లు రేసింగ్‌కి పాల్డడినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై గురువారం మోటార్ వెహికల్స్ డిపార్ట్‌మెంట్‌ విచారణకు ఆదేశించింది. అయితే ఆ వీడియో ఎప్పటిది అన్న విషయం తెలియరాలేదు.

ఈ ఘటనపై మోటార్ వెహికల్ డిపార్ట్‌మెంట్ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్ రాజీవ్‌ పుతలత్‌ మాట్లాడుతూ.. ”ఈ ఇద్దరు ర్యాష్ డ్రైవింగ్‌కి పాల్పడ్డారా..? లేదా..? అన్న దానిపై విచారణ జరుగుతోంది. ఇందులో వారు భాగస్వాములుగా ఉన్నారా..? లేదా..? కూడా తేల్చనున్నాము. వారు రోడ్డు సురక్షిత నియమాలను ఉల్లంఘించినట్లు నిర్ధారణకు రాలేము. సీసీ కెమెరాలలో నియమాలకు ఉల్లంఘించినట్లు తేలితే.. యజమానులకు నోటీసులు ఇస్తాము. ఒకవేళ ఇందులో దోషులుగా తేలితే మోటార్ వెహికల్ చట్టం 184 సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తాం. అలాగే ఈ వీడియోను చిత్రీకరించిన ఇద్దరు బైక్‌పై ఓవర్‌ స్పీడ్‌గా వెళ్లినట్లు అర్థమవుతోంది. వారిని గుర్తించి చర్యలు తీసుకుంటాం” అని అన్నారు.  కాగా ఇందులో వారు దోషులుగా తేలితే వారికి రూ. 1500 జరిమానా గానీ, ఆరు నెలలు జైలు శిక్ష కానీ విధించే అవకాశం ఉంది. అలాగే మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం అవ్వకుండా మరో రూ.3000లను చెల్లించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ వివాదంపై ఈ ఇద్దరు ఇంకా స్పందించలేదు.