Champion Movie : ఛాంపియన్ సినిమాలో కనిపించిన ఈ నటుడు ఎవరో గుర్తుపట్టారా.. ? బ్యాగ్రౌండ్ తెలిస్తే..

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన చిన్న సినిమాలు ఈ ఏడాది భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న సినిమా ఛాంపియన్. శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక హీరోగా నటించిన ఈ సినిమాకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.

Champion Movie : ఛాంపియన్ సినిమాలో కనిపించిన ఈ నటుడు ఎవరో గుర్తుపట్టారా.. ? బ్యాగ్రౌండ్ తెలిస్తే..
Yash Rangineni

Updated on: Dec 31, 2025 | 7:34 PM

చాలా కాలం తర్వాత శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక హీరోగా నటించిన లేటేస్ట్ సినిమా ఛాంపియన్. పీరియాడికల్ సినిమాగా రూపొందించిన ఈ సినిమాలో మలయాళీ ముద్దుగుమ్మ అనస్వర రాజన్ కథానాయికగా నటించింది. ఈ సినిమాతో ఆమె తెలుగు తెరకు పరిచయమైంది. విడుదలకు ముందే ట్రైలర్, పోస్టర్స్, సాంగ్స్ ద్వారా మంచి బజ్ క్రియేట్ చేసింది ఈ సినిమా. డిసెంబర్ 25న విడుదలైన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఓ ఆటగాడి నేపథ్యంలో చూపిస్తూనే అందమైన ప్రేమకథను చూపించారు. అయితే ఈ సినిమాలో రంగయ్య పాత్ర చాలా ఫేమస్ అయ్యింది.

ఇవి కూడా చదవండి :  Folk Song : యూట్యూబ్‏లో కోట్ల వ్యూస్.. నెల రోజులుగా ఇంటర్నెట్ షేక్.. ఇప్పటికీ దూసుకుపోతున్న పాట..

ఇవి కూడా చదవండి

ఇప్పుడు రంగయ్య పాత్రలో నటించిన నటుడి గురించి తెలుసుకునేందుకు అడియన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ? ఆ నటుడి పేరు యశ్ రంగినేని. ఆయన స్టార్ హీరో విజయ్ దేవరకొండ మేనమామ. యశ్ రంగినేని నటుడిగానే కాకుండా నిర్మాతగా సక్సెస్ అయ్యాడు. బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ స్థాపించి.. ఆ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన పెళ్లి చూపులు చిత్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత దొరసాని, డియర్ కామ్రేడ్, ఏబీసీడీ, అన్నపూర్ణ ఫోటో స్టూడియో, భాగ్ సాలే వంటి సినిమాలను నిర్మించారు.

ఇవి కూడా చదవండి :  Actor Suresh: సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. ఒక్క మాటలో చెప్పేసిన సీనియర్ హీరో..

నిర్మాతగా సక్సెస్ అయినప్పటికీ నటనపై ఆసక్తితో నటుడిగా మారారు. ఛాంపియన్ సినిమాలో రంగయ్య పాత్రకు తనకు ఛాన్స్ రావడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పుడు ఛాంపియన్ సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు.

ఇవి కూడా చదవండి : Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..

ఇవి కూడా చదవండి : Ranu Bombaiki Ranu Song : యూట్యూబ్ సెన్సేషన్.. రానూ బొంబాయికి రాను పాటకు ఎంత అమౌంట్ ఇచ్చారంటే.. డ్యాన్సర్ లిఖిత కామెంట్స్..