రెండు పెళ్లిళ్లు.. రెండు సార్లు విడాకులు.. ఇద్దరు పిల్లలు.. ఈ స్టార్ హీరోయిన్ లైఫ్‌లో ఊహించని ట్విస్ట్‌లు

సినీ సెలబ్రెటీల గురించి నిత్యం సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తూ ఉంటాయి. హీరోయిన్స్ గురించి ఎక్కువగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అందులోనూ బాలీవుడ్ భామల గురించి మరీ ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. సినిమాల కంటే చాలా మంది భామలు వ్యక్తిగత విషయాలతో వార్తల్లో ఎక్కువగా నిలుస్తూ ఉంటారు. అలాంటి వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఈ అమ్మడు చాలా ఫెమస్.

రెండు పెళ్లిళ్లు.. రెండు సార్లు విడాకులు.. ఇద్దరు పిల్లలు.. ఈ స్టార్ హీరోయిన్ లైఫ్‌లో ఊహించని ట్విస్ట్‌లు
Actress

Updated on: May 12, 2025 | 2:29 PM

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు ఎన్నో కష్టాలు, సమస్యలు ఎదుర్కొని ఇప్పుడు స్టార్స్ గా మారారు. అలాగే ఎంతో మందికి స్ఫూర్తిగా ను నిలిచారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్వయంకృషితో ఎదిగిన వారు చాలా మందే ఉన్నారు. అలాగే హీరోయిన్స్ లోను ఎన్నో కష్టాలు అనుభవించి ఇప్పుడు సక్సెస్ అయిన వారు కూడా చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ కూడా ఒకరు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందు ఎన్నో కష్టాలను చూసింది. వాటన్నింటిని అధిగమించి వచ్చిన వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఇప్పుడు స్టార్ గా మారింది. ఆమె ఎవరో గుర్తుపట్టారా.? ఆమె కష్టాల గురించి చేతే కన్నీళ్లు ఆగవు. 18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తల్లైంది..ఆ తర్వాత ఊహించని సంఘటనలు ఎదుర్కొంది. ఆమె ఎవరో తెలుసా..?

ఇండస్ట్రీలో చాలా కొంతమంది ఆర్టిస్ట్ లు చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్న వారు ఉన్నారు. అలాగే పెళ్లైన తర్వాత కూడా హీరోయిన్స్ గా రాణిస్తున్న వారు ఉన్నారు. ఇక పెళ్ళైన తర్వాత విడాకులు తీసుకున్న వారు కూడా ఉన్నారు. ఇక ఇప్పుడు మనం చెప్పుకుంటుంటున్న హీరోయిన్ కు ఏకంగా రెండు సార్లు విడాకులు అయ్యాయి. 18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తల్లైంది ఆతర్వాత రెండు సార్లు విడాకులు తీసుకుంది. ఇంతకూ ఆమె ఎవరంటే..

పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ బ్యూటీ శ్వేతా తివారి. హిందీలో ఈ అమ్మడు చాలా ఫెమస్. 2000లో ‘ఆనే వాలా పల్’ సీరియల్ ద్వారా నటిగా పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్ లో ఈ అమ్మడు సినిమాలు, సీరియల్స్ చేసి పాపులర్ అయ్యింది. కాగా ఈ అమ్మడి కి 18 ఏళ్లకే వివాహం జరిగింది. ఆతర్వాత 20 ఏళ్లకే బిడ్డకు జన్మినిచ్చింది. ఆతర్వాత భర్తతో విడిపోయింది. మరొక నటుడిని పెళ్లాడింది. అతనితో ఓ బిడ్డకు జన్మినిచ్చింది. కానీ ఆతర్వాత అతనితోనూ విడిపోయింది. శ్వేతా తివారి 1998లో నటుడు రాజా చౌదరిని వివాహం చేసుకొని తొమ్మిదేళ్ల తర్వాత 2007లో విడాకుల తీసుకుంది. వారికి 8 అక్టోబర్ 2000న కుమార్తె పాలక్ తివారీ జన్మించింది. ఆ తరువాత నటుడు అభినవ్ కోహ్లీ తో మూడు సంవత్సరాల పాటు డేటింగ్ చేసి ఆతర్వాత 13 జూలై 2013న ఆయనను వివాహం చేసుకొని 2016 నవంబర్ 27న మగబిడ్డకు జన్మనిచ్చింది. తివారీ, కోహ్లిలు 2019లో విడిపోయారు. జీవితంలో అనేక సమస్యలుఎదుర్కొన్న శ్వేతా తివారి ఇప్పుడు సినిమాల్లో తనదైన ముద్ర వేసింది.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.