143Movie: అమ్మ బాబోయ్.! 143 మూవీ హీరోయిన్ ఇప్పుడేంటి ఇలా మారిపోయింది..

పూరిజగన్నాథ్ సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్, డైలాగ్స్ యూత్ కు బాగా కనెక్ట్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమా 143 . ఈ సినిమాలో పూరిజగన్నాథ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ హీరోగా నటించాడు. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. బ్రహ్మానందం , ధర్మవరపు సుబ్రమణ్యం , ఆశా సైని, బ్రహ్మాజీ, ఎంఎస్ నారాయణ , అలీ ఇతర పాత్రల్లో నటించి మెప్పించారు. ఇక ఈ సినిమాలో సాయి రామ్ శంకర్ కు జోడీగా నటించిన హీరోయిన్ గురించి మీకు తెలుసా..?

143Movie: అమ్మ బాబోయ్.! 143 మూవీ హీరోయిన్ ఇప్పుడేంటి ఇలా మారిపోయింది..
143

Updated on: Aug 21, 2023 | 12:26 PM

డైనమిక్ డైరెక్టర్ పూరీజగన్నాథ్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. ఆయన సినిమాలు యువతను విశేషంగా ఆకట్టుకుంటాయి. పూరిజగన్నాథ్ సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్, డైలాగ్స్ యూత్ కు బాగా కనెక్ట్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమా 143 . ఈ సినిమాలో పూరిజగన్నాథ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ హీరోగా నటించాడు. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. బ్రహ్మానందం , ధర్మవరపు సుబ్రమణ్యం , ఆశా సైని, బ్రహ్మాజీ, ఎంఎస్ నారాయణ , అలీ ఇతర పాత్రల్లో నటించి మెప్పించారు. ఇక ఈ సినిమాలో సాయి రామ్ శంకర్ కు జోడీగా నటించిన హీరోయిన్ గురించి మీకు తెలుసా.. అసలు అమ్మడు ఇప్పుడు ఎలా ఉంది.? ఎక్కడ ఉంది.? ఏం చేస్తుంది.? అనేది తెలుసుకుందాం..

ఆమె పేరు సమీక్ష సింగ్. ఈ హీరోయిన్ తమిళం , తెలుగు , పంజాబీ , హిందీ ,కన్నడ భాషల్లో నటించి ప్రేక్షకులను అలరించింది.

అంతే కాదు అనేక మ్యూజిక్ వీడియోలు అలాగే సినిమాలకు దర్శకత్వం కూడా వహించింది. సమీక్ష సింగ్ మొదటి సినిమా 143నే ఈ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది.

అరింతుమ్ అరియమలుమ్‌ అనే సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 143 సినిమా తర్వాత కొత్త కథ, ఇది సంగతి, బ్రహ్మానందం డ్రామా కంపెనీ, సామ్రాజ్యం, దడ, కులుమనాలి లాంటి సినిమాల్లో నటించింది. అలాగే టెలివిజన్ లోనూ పలు సీరియల్స్ లో కనిపించింది సమీక్ష.

ఆ తర్వాత 2020లో, సింగపూర్‌లో సింగర్ షేల్ ఓస్వాల్‌ని సమీక్ష వివాహం చేసుకుంది. 2022లో భర్త షేల్ ఓస్వాల్‌తో కలిసి మాక్స్, మిన్ , మియోజాకి సినిమాలను నిర్మించింది. సోషల్ మీడియాలో సమీక్ష చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆమె లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. సమీక్ష లేటెస్ట్ ఫొటోస్ పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.