Karthika Deepam : అచ్చతెలుగు ఆడబడుచుగా ఆదరణ సొంతం చేసుకున్న కార్తీక దీపం అత్త సౌందర్య.. బ్యాక్ గ్రౌండ్ ఏమిటంటే!..

తెలుగు ఇంటిలో కార్తీక దీపం సీరియల్ చూడని వారుండరు అంటే అతిశయోక్తి కాదు.. అత్యంత ప్రజాదరణ కలిసిన సీరియల్ గా టాప్ రేటింగ్ తో దూసుకుపోతోంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల కూడా రాత్రి గం.7.30ని.అయితే చాలు టీవీల...

Karthika Deepam : అచ్చతెలుగు ఆడబడుచుగా ఆదరణ సొంతం చేసుకున్న కార్తీక దీపం అత్త సౌందర్య.. బ్యాక్ గ్రౌండ్ ఏమిటంటే!..

Edited By:

Updated on: Feb 10, 2021 | 12:16 AM

Karthika Deepam, Archana Ananth: తెలుగు ఇంటిలో కార్తీక దీపం సీరియల్ చూడని వారుండరు అంటే అతిశయోక్తి కాదు.. అత్యంత ప్రజాదరణ కలిసిన సీరియల్ గా టాప్ రేటింగ్ తో దూసుకుపోతోంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల కూడా రాత్రి గం.7.30ని.అయితే చాలు టీవీల ముందుకు చేరిపోతున్నారు. అంతగా ఆదరణ సొంతక్మ్ చేసుకుంది… కార్తీక దీపం

ఇక ఈ సీరియల్‌లో క్యారెక్టర్స్ వంటలక్క, డాక్టర్ బాబు. అత్తా సౌందర్య, విలన్ మౌనిత ఇలా అందరూ ఓ రేంజ్ లో క్రేజ్‌ని సొంతం చేసుకున్నారు. అయితే ఈ సినిమాలో నటిస్తున్న వారిలో కార్తీక్ ఒక్కడే తెలుగు యాక్టర్.. మిగిలిన వారందరూ ఇతరభాషలకు చెందినవారే. అత్త అంటే సౌందర్యలా ఉండాలి.. అలంటి అత్తగారు కావాలని కోరుకునే విధంగా నటిస్తున్న అర్చనా అనంత్, శోభా శెట్టి కర్ణాటకకు చెందిన వారు.

అర్చన బెంగళూరులో జన్మించారు. ఆమె మాతృభాష తమిళ్ అయినప్పటికీ.. కన్నడిగలాగా పెరిగారు. అర్చనా అనంత్ తల్లి ప్రభుత్వ ఉద్యోగి ఆయితే తండ్రి నటుడు. కన్నడ సీరియల్‌, సినిమాల్లో ఆయన నటించినట్లు తెలుస్తోంది.

ఇక అర్చన నటిగా తన కెరీర్‌ని ప్రారంభించకముందు బ్యూటీషియన్‌గా పనిచేశారు. ఫ్యాషన్ డిజైనింగ్‌లోనూ అర్చనకు ప్రవేశం ఉంది. అందుకనే సీరియల్స్ లో తన దుస్తులను తానే తానే చేసుకుంటారట. ఇక నటిగా అడుగు పుట్టకముందు అర్చన కాస్త బొద్దుగా కూడా ఉండేది. అయితే కార్తీక దీపం ప్రారంభమైన తరువాత కొన్ని అనారోగ్య కారణాల వలన ఆమె బరువును తగ్గారు.

అర్చనాకు అనంత్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అతడొక బిజినెస్‌మ్యాన్. ఈ దంపతులకు ఒక బాబు ఉన్నాడు. ఇక ఇప్పుడు పలు సీరియళ్లలో నటిస్తోన్న అర్చన.. అచ్చతెలుగు ఆడబడుచులా ఆదరణ సొంతం చేసుకుంది.

Also Read:

మన దేశంలో కాలక్రమంలో చరిత్రలో మాయమై.. నేడు పర్యాటక రంగాలుగా విలసిల్లుతున్న నగరాలు

పవన్‌ కోసం భారీ చార్మినార్‌ సెట్‌… ప్రేక్షకులను 300 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లనున్న దర్శకుడు..