Uday Kiran: ఉదయ్ కిరణ్ డెత్ మిస్టరీ గురించి తెలిసినా.. తెలియనట్లు నటిస్తున్నారు.. డైరెక్టర్ తేజ సంచలన వ్యాఖ్యలు

హీరో ఉదయ్‌ కిరణ్‌ డెత్‌ మిస్టరీ గురించి చాలామందికి తెలిసినప్పటికీ తెలియనట్టు నటిస్తున్నారని దర్శకుడు తేజ సంచలన వ్యా్ఖ్యలు చేశారు. తన తాజా చిత్రం ‘అహింస’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయనని ఉదయ్‌ కిరణ్‌ మిస్టరీ గురించి చెప్పమని వ్యాఖ్యాత అడగ్గా స్పందించారు.

Uday Kiran: ఉదయ్ కిరణ్ డెత్ మిస్టరీ గురించి తెలిసినా.. తెలియనట్లు నటిస్తున్నారు.. డైరెక్టర్ తేజ సంచలన వ్యాఖ్యలు
Director Teja

Updated on: May 25, 2023 | 4:20 AM

హీరో ఉదయ్‌ కిరణ్‌ డెత్‌ మిస్టరీ గురించి చాలామందికి తెలిసినప్పటికీ తెలియనట్టు నటిస్తున్నారని దర్శకుడు తేజ సంచలన వ్యా్ఖ్యలు చేశారు. తన తాజా చిత్రం ‘అహింస’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయనని ఉదయ్‌ కిరణ్‌ మిస్టరీ గురించి చెప్పమని వ్యాఖ్యాత అడగ్గా స్పందించారు. ఆ విషయం గురించి నేను చెబుతాను. కానీ, కొందరు ‘మీరే చెప్పండి’ అని అమాయకంగా యాక్ట్‌ చేస్తున్నారని తేజ సమాధానమిచ్చారు. అలాగే అంతకుముందు.. ‘ఉదయ్‌ గురించి ఒక్క మాటలో’ చెప్పాల్సిరాగా పాపం అని అన్నారు. ఉదయ్‌ కిరణ్‌ ఎందుకు చనిపోయాడో కారణం తనకు తెలుసని తేజ గతేడాది ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ విషయాన్ని గుర్తుచేస్తూనే ఆ వ్యాఖ్యాత మిస్టరీ గురించి చెప్పమన్నారు.

అయితే నటుడిగా ఉదయ్‌ కిరణ్‌ని తేజనే తెరపైకి తీసుకొచ్చారు. ‘చిత్రం’తో తొలి ప్రయత్నంలోనే సూపర్‌హిట్‌ అందుకున్న ఈ కాంబో ఆ తర్వాత ‘నువ్వు నేను’, ‘ఔనన్నా కాదన్నా’ సినిమాలు తెరకెక్కాయి. ఈ సినిమాలన్ని కూడా అప్పట్లో బ్లాక్ బస్టర్ అయ్యాయి.ఇక ‘అహింస’ సినిమా విషయానికొస్తే.. ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు తనయుడు అభిరామ్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రమిది. అయితే ఈ చిత్రంలో రజత్‌ బేడీ, గీతిక, సదా, రవికాలే, కమల్‌ కామరాజు తదితరులు నటించారు. ఆర్‌.పి. పట్నాయక్‌ సంగీతం అందించారు. ఈ సినిమా జూన్‌ 2న విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.