Acharya: మెగాస్టార్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆచార్య’. ఎన్నో అంచనాల నడుమ తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటి వరకు అపజయం ఎరగని దర్శకుడు దర్శకత్వం వహిస్తుండడం, తొలిసారి పూర్తి స్థాయిలో రామ్ చరణ్, చిరంజీవిలు కలిసి నటిస్తుండడంతో ఈ సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాయి. ఈ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అత్యంత జాగ్రత్తగా సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కొరటాల. నిజానికి ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాను ఫిబ్రవరి 4న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ పెంచే పనిలో పడ్డ చిత్ర యూనిట్ టీజర్, సాంగ్‌తో వేగాన్ని పెంచేసింది.
ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు కొరటాల చిత్రానికి సంబంధించి పలు ఆసక్తికర సన్నివేశాలను పంచుకున్నారు. టీజర్‌లో ఉండే రామ్ చరణ్, చిరంజీవిల సన్నివేశం గురించి కొరటాల మాట్లాడారు. ‘చిరంజీవి, రామ్ చరణ్‌ని ఓ వైపు, చిరుతల్ని మరోవైపు చూపించాం. సినిమాలో ఇదో అద్భుతమైన దృశ్యం. అది వాళ్లిద్దరికి సరిగ్గా సరిపోయింది. లక్కీగా అడవి నేపథ్యంలో సాగే సన్నివేశం కావడంతో, ఆ సన్నివేశం వచ్చింది. ఈ సీన్‌ను చిత్రీకరించేప్పుడు నేను దర్శకుడిగా కాకుండా చిరంజీవి అభిమానిగా ఎంతో సంతోషించాను’ అని చెప్పుకొచ్చారు. ఇక ఆచార్యకు సంబంధించిన మరో రెండు సర్‌ప్రైజ్‌లను త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలిపిన కొరటాల.. ఈ చిత్రంలో చిరు, చెర్రీలు కలిసి డ్యాన్స్ చేసే పాట ఉంటుందని, ఈ పాట చూస్తే అభిమానులకు పండగేనని చెప్పుకొచ్చారు.
Viral Video: వీరికి అవార్డ్ అయితే ఇవ్వాల్సిందే.. ఏం పేరు పెడతారో మీరే డిసైడ్ చెయ్యండి