Movie on Male Pregnancy: మరో ప్రయోగాత్మక చిత్రానికి బాలీవుడ్ రెడీ అవుతోంది. మేల్ ప్రెగ్నెన్సీపై మూవీ తీసేందుకు అక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రముఖ హాకీ క్రీడాకారుడు సందీప్ సింగ్ జీవిత కథను తెరకెక్కించిన షాద్ అలీ ఈ మూవీని తెరకెక్కించనున్నారు. సూర్మలో ప్రధాన పాత్ర పోషించిన దిల్జీత్ సింగ్.. ఈ మూవీలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరగుతున్నాయి. అయితే ఈ కథా నేపథ్యంలో ఇప్పటికే పంజాబీలో ఓ మూవీ రాగా.. ఆ చిత్ర రీమేక్ కాదని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. ఇక ఇందులో యువ హీరోయిన్ నటించబోతున్నట్లు కూడా తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.
Read More: