
ఆ ప్రాంతం సినిమా ప్రేమికులకి అడ్డ. ఏ సినిమా రిలీజ్ అయిన ఆ ప్రాంతమంతా అభిమానుల కేరింతలతో సందడిగా మారుతుంది. ఎందుకంటే.. ఆ అడ్డాలో ఒకప్పుడు దాదాపు పదిహేనుకు పైగా థియేటర్లు ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్య కాస్త తగ్గింది. అయిన ఇప్పటికీ ఆ క్రేజ్ తగ్గలేదు. ఎందుకంటే అక్కడ ఉంది సంధ్యా థియేటర్.. ఎన్ని థియేటర్లు వచ్చినా వెళ్లిపోయిన తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది సంధ్యా థియేటర్. ఇప్పుడు వివాదంలో ఉన్నప్పటికీ సినిమా ప్రేమికుల కు విడదీయరాని ఎమోషనల్ బాండ్ సంధ్యా థియేటర్. సినిమా అనగానే అందరికీ ఆర్టీసీ క్రాస్ రోడ్డు గుర్తుకొస్తుంది. కొత్త సినిమా రిలీజ్ అయిందంటే చాలు.. క్రాస్ రోడ్ లో వేల సంఖ్యలో సినీ లవర్స్ వాలిపోతుంటారు. తమ అభిమాన హీరోల సినిమాలు విడుదలైన రోజున.. పటాకులు, బ్యాండ్ మోతలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోతోంది. అంతేకాదు.. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న థియేటర్లలో చాలా సినిమాలు వంద రోజులకు పైగా ఆడాయి. పలు సినిమాలు సిల్వర్ జూబ్లీ వేడుకలను కూడా నమోదు చేసుకున్నాయి. అంతటి ప్రత్యేకత ఉన్న ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఉన్న తియేటర్లలో సంధ్య థియేటర్ మొదటి ప్లేస్ ఉంటుంది. గత పది రోజులుగా వివాదంలో, విషాదం లో నానుతున్న సంధ్య థియేటర్‌కు అభిమానులు, సినీ సెలబ్రెటీలతో ఘనమైన చరిత్రే ఉంది. సినిమాలకు అడ్డా అయిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాంతంలో 1979, జనవరి 18న సంధ్య 70ఎంఎం...