Deepika in Prabhas movie: రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న సైన్స్ ఫిక్షన్ సినిమాలో హీరోయిన్గా దీపికా పదుకొనే ఖరారైన విషయం తెలిసిందే. ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే ఈ ప్రకటన వచ్చిన మరుసటి రోజే ఓ వెబ్‌సైట్‌పై విరుచుకుపడ్డారు దీపికా. అందులో ఈ సినిమాను సదరు వెబ్సైట్ ప్రభాస్ 21 అంటూ పేర్కొనగా.. ఈ మూవీ పేరు ప్రభాస్ 21 కాదంటూ దీపిక ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు కాస్త షాక్‌కి గురయ్యారు.
సినిమాకు పేరును ఖరారు చేయనంతవరకు దాన్ని హీరో నటిస్తోన్న ఫలానా నంబర్ సినిమాతోనే చెప్తారని.. దానికి దీపికా అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదంటూ కొంతమంది విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే దీపికాకు సంబంధించిన మరో వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ మూవీకి దీపికా సంతకం చేసినా.. ఇంతవరకు అడ్వాన్స్ తీసుకోవలేదట. అయితే ఆమె ఇలా తీసుకోకపోవడానికి గల కారణం వేరే ఉందట.
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అడ్వాన్స్ తీసుకోవడం మంచి కాదని దీపికా అనుకుందట. అందులోనూ ఈ సినిమా భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతుండటం వలన ముందు సెట్స్ మీదకు వెళ్లి, షూటింగ్ ప్రారంభమై, మార్కెటింగ్ స్టార్ట్ అయిన తరువాతనే తన రెమ్యునరేషన్ ఇవ్వాలని దీపికా నిర్మాతకు సూచించారట. దీంతో నిర్మాత అశ్వనీదత్ సైతం, దీపికా పట్ల హ్యాపీగా ఫీలైనట్లు తెలుస్తోంది. నిర్మాతల గురించి ఆలోచించే వారు చాలా తక్కువగా ఉంటారని, అలాంటి వారిలో దీపికా కూడా ఒకటని ఆయన కితాబిచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ మూవీ కోసం దీపికాకు దాదాపుగా 20 కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నట్లు టాక్.
Read More:
నెట్‌ఫ్లిక్‌లో ఈ సినిమాలు, వెబ్సిరీస్ని ఫ్రీగా చూడొచ్చు