నెట్‌ఫ్లిక్‌లో ఈ సినిమాలు, వెబ్‌సిరీస్‌ని ఫ్రీగా చూడొచ్చు

ఈ మధ్యకాలంలో ఓటీటీ హవా బాగా నడుస్తోంది. ఇక లాక్‌డౌన్ సమయంలో థియేటర్లకు బ్రేక్ పడటంతో.. చాలా సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి.

నెట్‌ఫ్లిక్‌లో ఈ సినిమాలు, వెబ్‌సిరీస్‌ని ఫ్రీగా చూడొచ్చు
Follow us

| Edited By:

Updated on: Sep 04, 2020 | 12:35 PM

Netflix Free Movies: ఈ మధ్యకాలంలో ఓటీటీ హవా బాగా నడుస్తోంది. ఇక లాక్‌డౌన్ సమయంలో థియేటర్లకు బ్రేక్ పడటంతో.. చాలా సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. మరికొన్ని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఓటీటీలకు డిమాండ్ మరింత పెరుగుతోంది. ఇదిలా ఉంటే మిగిలిన అన్ని ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫామ్‌లకు నెట్‌ఫ్లిక్స్ కాస్త వేరుగా ఉంటుంది. అందులో ఏం చూడలన్నా ముందుగా సబ్‌స్క్రైబ్ అవ్వాల్సిందే. అయితే ఈ మధ్య నెట్‌ఫ్లిక్స్ కూడా కొన్ని షోలు, మూవీలను ఉచితంగా చూసే అవకాశం కల్పిస్తోంది.

అయితే వాటిని చూడాలనుకుంటే ఆయా సినిమా, వెబ్‌ సిరీస్‌ పేర్లను గూగుల్‌లో టైప్ చేసి, చివర్లో నెట్‌ఫ్లిక్స్ అని జోడించాలి. అప్పుడు ఆ సినిమా లింక్ వస్తుంది. దాన్ని క్లిక్‌ చేస్తే నెట్‌ఫ్లిక్స్‌లో ఆ మూవీకి సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది. ఇక అక్కడ వాచ్‌ ఇట్ నౌ వితౌట్ సైన్ అప్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేస్తే.. దాన్ని ఉచితంగా చూడొచ్చు. అయితే ఈ ఉచిత మూవీలు, వెబ్‌సిరీస్‌లు తరచుగా మారుతూ ఉంటాయి. ప్రస్తుతం అయితే కొన్ని మూవీలు, వెబ్‌సిరీస్‌లను నెట్‌ఫ్లిక్స్‌లో ఫ్రీగా చూసేయొచ్చు. ఆ లిస్ట్‌ ఏంటంటే

వెబ్‌సిరీస్‌లు: స్ట్రేంజర్ థింగ్స్‌ ఎలైట్‌ బాస్ బేబీ: బ్యాక్ ఇన్ బిజినెస్‌ వెన్‌ దె సీ ఆజ్‌ లవ్ ఈజ్ బ్లైండ్‌ అవర్ ప్లానెట్‌ గ్రేస్ అండ్ ఫ్రాంకీ

సినిమాలు: మర్డర్ మిస్టరీ బర్ల్‌ బాక్స్‌ ది టూ పోప్స్.

ఇంకెందుకు ఆలస్యం అయితే నెట్‌ఫ్లిక్స్ ఇస్తోన్న ఈ ఫ్రీ ఆఫర్‌ని వినియోగించుకోండి.

Read More:

డ్రగ్స్ కేసు: నటి అరెస్ట్‌.. ఇంట్లో సోదాలు

పేకాటలో దొరికిపోయానన్న మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య