Deepika Padukone : బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ లో దీపికా పదుకునే ఒకరు. ఈ అమ్మడు అత్యధిక పారితోషకం తీసుకునే హీరోయిన్స్ లోను ఉంది. ప్రస్తుతం వరుస సూపర్ హిట్లతో స్టార్ హీరోయిన్ గా అక్కడ రాణిస్తుంది. త్వరలోనే టాలీవుడ్ లోకి కూడా అడుగు పెట్టనుంది ఈ కుర్రది. హీరో రణ్ వీర్ సింగ్ ను లవ్వడి పెళ్లాడిన దీపికా వివాహం తర్వాత కూడా సినిమాలను కంటిన్యూ చేస్తుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దీపికా కెరియర్ బిగినింగ్ లో ఎదుర్కొన్న అవమానాలను ఇబ్బందులను చెప్పింది. దీపికా మాట్లాడుతూ.. 19 ఏళ్ల వయసులో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టా.. మొదటి సినిమానే షారుక్ ఖాన్ సరసన ఛాన్స్ రావడంతో చాలా ఆనందపడ్డా.. ఆ సమయంలో నాకు యాక్టింగ్ పైన ఎలాంటి అవగాహనా లేదు. ఆ సమయంలో డైరెక్టర్ ఫరాఖాన్ , షారుక్ ఖాన్ సలహాలు ఎంతో ఉపయోగ పడ్డాయి. అయితే సినిమా విడుదలైన తర్వాత నా నటన, డైలాగ్ డెలివరీ భలేవంటూ కామెంట్లు వినిపించాయి అని చెప్పుకొచ్చింది. మోడలింగ్‌నుంచి వచ్చిన నేను నటనకు పనికిరానంటూ విమర్శించారు. అవన్నీ చూసిన తర్వాత సినిమాల్లో నటించకూడదని అనుకున్నా కానీ అవమానాలన్నీ ఛాలెంజ్ గా తీసుకున్నా నా తప్పులన్నీ సరిదిద్దుకుంటూ ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్న అంటూ చెప్పుకొచ్చింది దీపికాపదుకునే.
also read : Monal Gajjar : ‘అల్లుడు అదుర్స్’లో మోనాల్ గజ్జర్ స్పెషల్ సాంగ్..రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?