Deepika Padukone: కొత్త సంవత్సరంలో అభిమానులకు షాకిచ్చిన బాలీవుడ్ సొట్టబుగ్గల సుందరి.. ఎందుకు ఇలా చేసిందో తెలియక..

Deepika Padukone: నూతన సంవత్సర సందర్భంగా సెలబ్రిటీలు సోషల్ మీడియా కేంద్రంగా విషెస్, గ్రీటింగ్స్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటే

Deepika Padukone: కొత్త సంవత్సరంలో అభిమానులకు షాకిచ్చిన బాలీవుడ్ సొట్టబుగ్గల సుందరి.. ఎందుకు ఇలా చేసిందో తెలియక..
Follow us
uppula Raju

|

Updated on: Jan 01, 2021 | 12:11 PM

Deepika Padukone: నూతన సంవత్సర సందర్భంగా సెలబ్రిటీలు సోషల్ మీడియా కేంద్రంగా విషెస్, గ్రీటింగ్స్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటే మరోవైపు ప్రముఖ నటి అభిమానులను నిరుత్సాహనికి గురి చేస్తోంది. కొత్త సినిమా అప్‌డేట్స్ తెలియజేస్తూ ఉత్సాహ పరచాల్సిన సమయంలో ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది.

బాలీవుడ్ టాప్ హీరోయిన్, సొట్ట బుగ్గల సుందరి దీపికా పదుకొనేకు ఏమైందో తెలియదు కానీ విచిత్రంగా ప్రవర్తిస్తోంది. సోషల్‌ మీడియాలో తన పోస్టులు డిలీట్‌ చేసి అభిమానులకు షాకిచ్చింది. కొత్త ఏడాదికి శుభం పలుకుతూ ఏదైనా స్పెషల్‌ మెసేజ్‌ ఇస్తుందేమో అనుకుంటే ఇలా తన ఖాతాలను ఖాళీ చేయడమేంటని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. 52 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌లో దీపిక అన్ని పోస్టులు తొలగించడంతో ప్రస్తుతం ఆమె పోస్టుల సంఖ్య జీరోగా ఉంది. 27 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న ట్విటర్‌ ఖాతాలోనూ ఇప్పటివరకు చేసిన ట్వీట్లన్నింటిని తొలగించింది. అయితే ఇదంతా ఎందుకు చేసిందో అర్థం కాక అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. ‘కొంపదీసి ఆమె అకౌంట్‌ హ్యాక్‌ అయిందా?’, ‘ఆమెకు అంతా బాగానే ఉంది కదా!’, ‘ఈ చర్య వెనుక ఏదైనా మర్మముందా?’ అంటూ రకరకాల అనుమానాలను లేవనెత్తుతున్నారు. వీటన్నింటిపై దీపికా పదుకొనె స్పందించాల్సి ఉంది.