‘FCUK’ టీజర్ విడుదల చేసిన డైరెక్టర్ రాజమౌళి.. ఫుల్‌గా నవ్వించేందుకు సిద్ధమైన జగ్గుభాయ్..
సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి మంచి ఫాం మీద దూసుకుపోతున్నాడు ఒకప్పటి హీరో జగపతి బాబు. అటు పలు సినిమాల్లో నాన్న, విలన్ పాత్రల్లో నటించి
సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి మంచి ఫాం మీద దూసుకుపోతున్నాడు ఒకప్పటి హీరో జగపతి బాబు. అటు పలు సినిమాల్లో నాన్న, విలన్ పాత్రల్లో నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఇటీవల జగపతిబాబు ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ఎఫ్‌సీయూకే (ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్). ఈ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడానికి రాబోతున్నాడు. ఇప్పుటికే ఈ సినిమాకు సంబంధించిన పాత్రలను ఒక్కోక్కటిగా రివీల్ చేస్తూ వచ్చారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను దర్శకదీరుడు రాజమౌళి చేత విడుదల చేయించారు ఫిల్మ్ మేకర్స్.
తాజాగా విడుదలైన టీజర్‌ని బట్టి చూస్తే ఈ సినిమా నాలుగు పాత్ర చుట్టూ తిరిగే కథతో చక్కగా తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. ఇందులో అమ్మాయిలని పడేసే పాత్రలో జగపతి బాబు నటిస్తున్నారు. ఇదే నెలలో ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్రబృందం ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ పై కేఎల్ దామోదర్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో కార్తీక్, అమ్ము అభిరామ్, బేబి సహశ్రిత కీలక పాత్రల్లో నటిస్తున్నారు.