‘ఆర్ఆర్ఆర్‌’కు మరో బిగ్ షాక్.. తప్పుకున్న హీరోయిన్

| Edited By:

Apr 06, 2019 | 6:38 AM

టాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ‘ఆర్ఆర్ఆర్’కు మరో బిగ్ షాక్ తగిలింది. ఈ మూవీ నుంచి తప్పుకుంటున్నట్లు హీరోయిన్ డైసీ ఎడ్గర్ జోన్స్ వెల్లడించింది. ఈ విషయాన్ని ఎడ్గర్ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది. ‘‘కుటుంబ కారణాల వలన మంచి సినిమా నుంచి తప్పుకుంటున్నా. ఈ కథ, నా పాత్ర చాలా బావుంది’’ అంటూ ఆమె పేర్కొంది. See more మరోవైపు ఈ విషయాన్ని ‘ఆర్ఆర్ఆర్’ టీం కూడా కన్ఫర్మ్ చేసింది. ‘‘కొన్ని కారణాల వలన డైసీ ఎడ్గర్ జోన్స్ ఆర్ఆర్ఆర్‌లో […]

‘ఆర్ఆర్ఆర్‌’కు మరో బిగ్ షాక్.. తప్పుకున్న హీరోయిన్
Follow us on

టాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ‘ఆర్ఆర్ఆర్’కు మరో బిగ్ షాక్ తగిలింది. ఈ మూవీ నుంచి తప్పుకుంటున్నట్లు హీరోయిన్ డైసీ ఎడ్గర్ జోన్స్ వెల్లడించింది. ఈ విషయాన్ని ఎడ్గర్ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది. ‘‘కుటుంబ కారణాల వలన మంచి సినిమా నుంచి తప్పుకుంటున్నా. ఈ కథ, నా పాత్ర చాలా బావుంది’’ అంటూ ఆమె పేర్కొంది.

మరోవైపు ఈ విషయాన్ని ‘ఆర్ఆర్ఆర్’ టీం కూడా కన్ఫర్మ్ చేసింది. ‘‘కొన్ని కారణాల వలన డైసీ ఎడ్గర్ జోన్స్ ఆర్ఆర్ఆర్‌లో నటించలేకపోతోంది. ఆమెకు మంచి భవిష్యత్ ఉంటుందని ఆశిస్తున్నాం’’ అంటూ పేర్కొంది.

కాగా ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఎడ్గర్ జోన్స్, చెర్రీ సరసన అలియా భట్‌ను ఎంచుకున్నారు. అయితే ఇప్పుడు ఎడ్గర్ తప్పుకోవడంతో ఆమె స్థానంలో మరో హీరోయిన్ కోసం వేట మొదలుపెట్టారు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, కోలీవుడ్ నటుడు సముద్రఖని కీలక పాత్రలలో కనిపించనున్నారు.

ఇదిలా ఉంటే ఈ మూవీ రెండు షెడ్యూల్‌లు విజయవంతంగా పూర్తి అవ్వగా.. ఇటీవల జిమ్‌లో చెర్రీకి గాయం అవ్వడంతో మూడో షెడ్యూల్‌‌కు బ్రేక్ పడింది. ఇప్పుడు ఎడ్గర్ నిర్ణయంతో ‘ఆర్ఆర్ఆర్’ టీంకు మరో షాక్ పడ్డట్లైంది. కాగా డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూలై 30న విడుదల చేయాలనుకున్న విషయం తెలిసిందే.