Tollywood: చిన్నప్పడు ఇంత క్యూట్ ఉన్న ఈ పాప ఇప్పుడు ఆటంబాంబ్.. టాప్ హీరోయిన్

చిన్ని కళ్లు, బోసి నవ్వు.. ముద్దొస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు ఇండియాలోనే స్టార్ హీరోయిన్. పుట్టింది విదేశాల్లో అయినా పెరిగిందంతా ఇండియాలోనే. సాధారణంగా డాక్టర్ పిల్లలు… డాక్టర్, ఇంజనీర్ పిల్లలు ఇంజనీర్స్ అవుతారని అంటుంటారు. కానీ ఈమె విషయంలో రివర్స్ అయ్యింది. తండ్రి ఉన్న రంగంలో కాకుండా తనకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోకి అడుగుపెట్టింది.

Tollywood: చిన్నప్పడు ఇంత క్యూట్ ఉన్న ఈ పాప ఇప్పుడు ఆటంబాంబ్.. టాప్ హీరోయిన్
Heroine Childhood Photo

Updated on: May 29, 2024 | 8:18 PM

ప్రజంట్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సెలబ్రిటీల ఫోటోలే. తాజా తారల సినిమా అప్ డేట్స్, గాసిప్స్‌తో పాటు వారి చిన్ననాటి ఫోటోలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి. అలాంటి ఓ ఫోటోను ఈ రోజు మీ ముందకు తెచ్చాం.  ముద్దు ముద్దుగా నవ్వుతో.. ఎంతో అమాయకంగా కనిపిస్తున్న ఈ చిన్నది ఇప్పుడు ఇండియాలోనే బడా హీరోయిన్. పాత్ర ఏదైనా ప్రాణం పోయడం ఆమె స్పెషాలిటీ. సొట్ట బుగ్గల సుందరిగా ఫేమస్. ఇంకో విషయం ఏంటంటే.. తను ఓ స్టార్ హీరోను పెళ్లాడింది. త్వరలో ఓ బిడ్డకు జన్మనివ్వబోతుంది. సౌత్‌లో పుట్టిన ఈ బ్యూటీ… బాలీవుడ్‌ను ఏలేస్తుంది. ఆమె తండ్రి ఫేమస్ బ్యాట్మెంటెన్ ప్లేయర్. ఇప్పటికే అందరికీ అర్ధం అయి ఉంటుంది తను దీపికా పుదకునే అని.

దీపికా కూడా బ్యాడ్మింటన్ ప్లేయరే. నేషనల్ లెవల్లో ఆడింది. చిన్నప్పుడే మోడలింగ్ వైపు అడుగులు వేసి.. పలు యాడ్స్ చేసింది. టెన్త్ క్లాసులో ఆమె నటి అవ్వాలని నిర్ణయం తీసుకుంది. 2006లో వచ్చిన కన్నడ చిత్రం ఐశ్వర్య (మన్మధుడు రీమేక్)తో ఇండస్ట్రీలో అడుగుపెట్టి విజయాన్ని అందుకుంది. అనంతరం ఆమెకు బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. షారూఖ్ మూవీ ‘ఓం శాంతి ఓం’ హిట్ కొట్టడంతో ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇక వరుస పెట్టి అవకాశాలు క్యూ కట్టాయి. అలా వరుస సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోయిన్ అయి.. దేశంలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న నటిగా మారింది.

ప్రజెంట్‌ బీటౌన్‌లో నెంబర్ హీరోయిన్‌ ఎవరు అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు దీపిక పదుకోన్‌. వరుసగా కమర్షియల్‌ బ్లాక్ బస్టర్స్‌తో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ఈ బ్యూటీ, స్టార్ ఇమేజ్‌ వచ్చిన తరువాత ఒక్క సౌత్ సినిమా కూడా చేయలేదు. కల్కి 2898 ఏడీతో దక్షిణాది ప్రేక్షకులను పలకరించబోతున్నారు దీపిక. గ్లోబల్ కాన్సెప్ట్ కావటం, ఇండియన్ సూపర్‌ స్టార్ ప్రభాస్ హీరో కావటం, ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌లో తెరకెక్కుతుండటంతో కల్కిలో నటించేందుకు వెంటనే ఓకే చెప్పారు దీపిక.

ఇప్పటికే హాలీవుడ్ సినిమాల్లో నటించిన దీపిక, కల్కి సినిమాకు గ్లోబల్ ఇమేజ్‌ తీసుకురావటంలో హెల్ప్ అవుతారన్న నమ్మకంతో ఉన్నారు మేకర్స్. దీనికితో దీపికకు ఆల్రెడీ యాక్షన్ మూవీస్‌ చేసిన అనుభవం కూడా ఉంది. ఆ ఎక్స్‌పీరియన్స్‌ కూడా కల్కికి హెల్ప్ అవుతుందని నమ్ముతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి