Shilpa Shetty: శిల్పాశెట్టి దంపతులకు షాక్.. పోలీసులకు ఫిర్యాదు
చీటింగ్ చేశారంటూ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాపై ముంబయి పోలీసులను సంప్రదించారు ఓ వ్యక్తి. వీరిద్దరికి సంబంధించిన ఓ కంపెనీ తనను మోసం చేసిందని సచిన్ జోషి అనే ఎన్‌ఆర్ఐ ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చీటింగ్ చేశారంటూ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాపై ముంబయి పోలీసులను సంప్రదించారు ఓ వ్యక్తి. వీరిద్దరికి సంబంధించిన ఓ కంపెనీ తనను మోసం చేసిందని సచిన్ జోషి అనే ఎన్‌ఆర్ఐ ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2014లో రాజ్ కుంద్రా, శిల్పా శెట్టిలకు చెందిన సత్యయుగ్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఐదేళ్లకు సంబంధించిన ఓ గోల్డ్ స్కీమ్ ప్రకటించిందని .. అందులో భాగంగా రూ.18.58 లక్షలకు తాను కిలో బంగారం కొనుగోలు చేశానని సదరు వ్యక్తి తెలిపారు. దీనికి ఆధారంగా తనకు ఒక గోల్డ్ కార్ట్ కూడా ఇచ్చారని అతడు పేర్కొన్నాడు.
అయితే ఐదేళ్లు గడిచినా.. శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాలు ఇప్పటికీ బంగారం ఇవ్వలేదని అతడు తన ఫిర్యాదులో వెల్లడించారు. దానికి తోడు జోషి టర్మ్ ప్లాన్ 2019 మార్చి 25న ముగియగా.. గోల్డ్ స్కీమ్ ప్రకారం తాను ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు బంగారం తీసుకోవడానికి వారి కార్యాలయానికి వెళ్లానని.. కానీ అప్పటికే కంపెనీ మూసేశారని చెప్పారు. ఆ తరువాత ఈ విషయమై శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాలను సంప్రదించగా.. తామిద్దరం ఆ కంపెనీకి రాజీనామా చేశామని అన్నారని తెలిపారు. ఈ నేపధ్యంలో మోసపోయానని గ్రహించిన జోషి తాజాగా పోలీసులను సంప్రదించారు. కాగా ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి కేవలం కంప్లైంట్ మాత్రమే వచ్చిందని.. ఇంకా కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ సంఘటనపై ఇంకా శిల్పా స్పందించలేదు.