ఆసుపత్రిలో కొరియోగ్రాఫ‌ర్ రెమో డిసౌజా డ్యాన్స్.. వీడియో షేర్ చేసిన ఆయన సతీమణి.. ఆనందంలో అభిమానులు

|

Dec 14, 2020 | 10:20 PM

ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా ఇటీవల గుండె పోటుతో  ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.  రెమో కు గుండెపోటు రావడంతో ఆయన అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

ఆసుపత్రిలో కొరియోగ్రాఫ‌ర్ రెమో డిసౌజా డ్యాన్స్.. వీడియో షేర్ చేసిన ఆయన సతీమణి.. ఆనందంలో  అభిమానులు
Follow us on

ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా ఇటీవల గుండె పోటుతో  ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.  రెమో కు గుండెపోటు రావడంతో ఆయన అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆయన త్వరగా కోలుకోవాలని, అభిమానులు ప్రార్ధనలు చేస్తున్నారు. ఆస్ప‌త్రిలో చేరిన త‌ర్వాత తొలిసారి తీసిన ఓ వీడియోను రెమో స‌తీమ‌ణి లిజెల్లే డిసౌజా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. రెమో స్లైలిష్ హిపాప్ సాంగ్ కు డ్యాన్స్ చేస్తుంటే కాళ్ల‌ను వీడియో తీసింది లిజెల్లే.

ఈ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది లిజెల్లే.త‌మ అభిమాన డ్యాన్స‌ర్ కోలుకుని ఇలా స్టెప్పులేస్తుండ‌టంతో ఆనందంలో వ్యక్తం చేస్తున్నారు రెమో ఫాలోవ‌ర్లు. ఈ వీడియోతోపాటు ‘కాళ్ల‌తో డ్యాన్స్ చేయ‌డం ఒక‌టైతే..హృద‌యంతో డ్యాన్స్ చేయ‌డం మరొక‌టి..రెమో డిసౌజా త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థించిన వారికి ధ‌న్య‌వాదాలు’అంటూ రాసుకొచ్చింది లిజెల్లే. రెమో డిసౌజా డ్యాన్స్ ఇండియా డ్యాన్స్, డ్యాన్స్ ప్లస్, ఝలక్ దిక్లాజా వంటి డ్యాన్స్ రియాల్టీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక రెమో డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.