చిరు-రానా మల్టీస్టారర్‌.. ఆ రీమేక్ కోసం కాదు..!

టాలీవుడ్‌లో మల్టీస్టారర్‌ చిత్రాలకు క్రేజ్‌ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో క్రేజీ మల్టీస్టారర్‌ సెట్స్ మీదకు వెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. చిరంజీవి దర్శకుల లిస్ట్‌లో యువ దర్శకుడు బాబీ కూడా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చిరు, కొరటాల దర్శకత్వంలో ఆచార్యలో నటిస్తుండగా.. ఆ తరువాత సుజీత్ డైరక్షన్‌లో లూసిఫర్ రీమేక్‌లో నటించబోతున్నారు. ఈ రెండు చిత్రాల తరువాత బాబీ దర్శకత్వంలో నటించేందుకు మెగాస్టార్ రెడీ అవుతున్నారు. దీనికి […]

చిరు-రానా మల్టీస్టారర్‌.. ఆ రీమేక్ కోసం కాదు..!

Edited By:

Updated on: May 08, 2020 | 7:35 PM

టాలీవుడ్‌లో మల్టీస్టారర్‌ చిత్రాలకు క్రేజ్‌ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో క్రేజీ మల్టీస్టారర్‌ సెట్స్ మీదకు వెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. చిరంజీవి దర్శకుల లిస్ట్‌లో యువ దర్శకుడు బాబీ కూడా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చిరు, కొరటాల దర్శకత్వంలో ఆచార్యలో నటిస్తుండగా.. ఆ తరువాత సుజీత్ డైరక్షన్‌లో లూసిఫర్ రీమేక్‌లో నటించబోతున్నారు. ఈ రెండు చిత్రాల తరువాత బాబీ దర్శకత్వంలో నటించేందుకు మెగాస్టార్ రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే చిరుకు కథను చెప్పారట బాబీ.

మల్టీస్టారర్‌ మూవీగా బాబీ.. ఈ సినిమాను తెరకెక్కించాలనుకుంటుండగా రెండో పాత్ర కోసం మరో హీరోను తీసుకోవాలని ఆయన అనుకున్నారట. ఈ క్రమంలో రానా పేరు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. చెర్రీకి ప్రాణ స్నేహితుడైన రానాను ఈ ప్రాజెక్ట్‌లో భాగం చేయాలని బాబీ కూడా అనుకుంటున్నారట. దానికి తోడు దగ్గుబాటి ఫ్యామిలీతో ఈ దర్శకుడికి మంచి సాన్నిహిత్యం ఉండటంతో.. త్వరలోనే రానాకు కథను చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Read This Story Also: లాక్‌డౌన్‌ సడలింపులు.. ఖుషీలో కోలీవుడ్..!