సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా ‘దిశ ఎన్‌కౌంటర్’. దేశవ్యాప్తంగా కలకలం రేపిన దిశ హత్యాచార ఘటన ఆధారంగా వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కాగా ఈ సినిమాను ఆపాలంటూ గతంలో దిశ తల్లిదండ్రులతోపాటు.. నిందితుల కుటుంబసభ్యులు కూడా కోరారు. తాజాగా కోర్టు కూడా ఈ సినిమా విడుదలకు అనుమతి ఇవ్వకపోవడంతో ప్రతిష్టంభన కొనసాగుతుంది. తాజాగా వర్మకు సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చింది. ఈ సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు అడ్డు చెప్పింది. నలుగురు సెన్సార్ సభ్యుల బోర్డు కూడా సినిమాకు సెన్సార్ ఇవ్వాలా..? వద్దా..? అన్నది తేల్చుకోలేక పోయారు. సెన్సార్ బృందం నుంచి అనుమతి రాకపోవడంతో రివిజన్ కమిటీ పరిశీలనకు చేరింది దిశ ఎన్‌కౌంటర్ మూవీ. ఎనిమిది సభ్యులతో కూడిన రివిజన్ కమిటీ మరోసారి సినిమా చూడనుంది.
మరిన్ని ఇక్కడ చదవండి : Happy Birthday Sekhar Kammula: తెలుగులో మంచి కాఫీ లాంటి సినిమాలకు కేరాఫ్ అడ్రస్… హ్యాపీ బర్త్ డే మిస్టర్ కూల్ డైరెక్టర్