SPB Death: నింగికేగిన బాలు.. ప్రముఖుల నివాళులు

మరో గొంతు మూగబోయింది. ఆయన తిరిగి రావాలంటూ దేశవ్యాప్తంగా చేసిన ప్రార్థనలు ఫలించలేదు. గానగంధర్వుడు, పద్మభూషణ్ ఎస్పీబాలసుబ్రహ్మణ్యం నింగికేగారు.

SPB Death: నింగికేగిన బాలు..  ప్రముఖుల నివాళులు

Edited By:

Updated on: Sep 25, 2020 | 3:14 PM

SP Balasubrahmanyam death: మరో గొంతు మూగబోయింది. ఆయన తిరిగి రావాలంటూ దేశవ్యాప్తంగా చేసిన ప్రార్థనలు ఫలించలేదు. గానగంధర్వుడు, పద్మభూషణ్ ఎస్పీబాలసుబ్రహ్మణ్యం నింగికేగారు. కరోనా సోకి గత నెల 5న ఆసుపత్రిలో చేరిన ఎస్పీబీ.. కరోనాను జయించినప్పటికీ, మిగిలిన అనారోగ్య సమస్యలతో పోరాటం చేస్తూ కన్నుమూశారు. దీంతో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. కరోనా సోకినప్పుడు.. ”ధైర్యంగా దీన్ని ఎదుర్కొంటా. ఆరోగ్యంగా మీ ముందుకు వస్తానంటూ” అందరికీ ధైర్యం ఇచ్చిన ఎస్పీబీ, ఇవాళ మధ్యాహ్నం గం.1.04ని.లకు తుది శ్వాస విడిచారు. భారతదేశం గర్వించదగ్గ గాయకుల్లో ఒకరైన బాలసుబ్రహ్మణ్యం మరణంతో సినీ ప్రపంచం మూగబోయింది. ఆయనను నివాళులు చెబుతూ పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు. మీ పాటలతో మా గుండెల్లో ఎప్పుడూ బతికే ఉంటారు. కుదిరితే మళ్లీ రండి సర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.