Tollywood: జిమ్‌లో తెగ కష్టపడుతోన్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.? అందానికి పర్యాయ పదం ఈ చిన్నది

|

Apr 17, 2023 | 9:16 PM

ఇటీవలి కాలంలో ప్రతీ ఒక్కరిలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఫిట్‌గా ఉండడానికి తెగ కష్టపడుతున్నారు. జిమ్స్‌లో కుస్తీ పడుతున్నారు. సినిమాల్లో నటించే వారే కాదండోయ్‌ సామాన్యులు కూడా...

Tollywood: జిమ్‌లో తెగ కష్టపడుతోన్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.? అందానికి పర్యాయ పదం ఈ చిన్నది
Guess The Actress
Follow us on

ఇటీవలి కాలంలో ప్రతీ ఒక్కరిలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఫిట్‌గా ఉండడానికి తెగ కష్టపడుతున్నారు. జిమ్స్‌లో కుస్తీ పడుతున్నారు. సినిమాల్లో నటించే వారే కాదండోయ్‌ సామాన్యులు కూడా సిక్స్‌ ప్యాక్‌తో హల్చల్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో జిమ్‌లో వర్కవుట్‌ చేస్తున్న సమయంలో దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ తెగ మురిసి పోతున్నారు. ఇక సినీ తారల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ కూడా ఇలాగే జిమ్‌లో తెగ కష్టపడుతోంది.

కేవలం రెండు చేతులపైనే శరీర బరువంతా మోస్తూ గాల్లో తేలుతున్న ఈ అందాల తార టాలీవుడ్‌ ప్రముఖ హీరోయిన్‌. కేవలం టాలీవుడ్‌లో మాత్రమే కాకుండా హిందీ, తమిళంలోనూ వరుస సినిమాలు చేస్తోందీ చిన్నది. మొన్నటి మొన్న బాలీవుడ్‌లో ఓ వెబ్‌ సిరీస్‌ ద్వారా ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ అమ్మడిని ఏకంగా 99 లక్షల మంది ఫాలో అవుతున్నారు. మనం మూవీలో గెస్ట్‌ రోల్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైందీ బ్యూటీ.

ఇవి కూడా చదవండి

ఈ హీరోయిన్‌ ఎవరో ఇప్పటికే మీకు ఓ క్లారిటీ వచ్చేసి ఉండొచ్చు కదూ! అవును మీ గెస్‌ కరక్టే. ఈ అమ్మడు మరెవరో కాదు అందాల రాశీ ఖన్నానే. తన అందం, అభినయంతో కుర్రాళ్లను కట్టిపడేస్తున్న ఈ చిన్నది ఇలా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వర్కవుట్స్‌ చేస్తున్న ఫొటోను షేర్‌ చేసి నెట్టింట ట్రెండింగ్‌ నాలిచింది. ఇక కెరీర్‌ విషయానికొస్తే రాశీ ఖన్నా.. థాంక్యూ మూవీ తర్వాత మళ్లీ తెలుగులో నటించలేదు. ప్రస్తుతం హిందీలో యోధాతో పాటు తమిళంలో రెండు చిత్రాల్లో నటిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..