Rashi Khanna: కెరీర్ మొదటి నుంచి వరుస సినిమాలతో బిజీగా దూసుకుపోతోంది అందాల తార రాశీ ఖన్నా. తెలుగు, తమిళంతో పాటు హిందీలో ఏక కాలంలో సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం చేతిలో ఏకంగా ఆరు సినిమాలు ఉన్న ఈ చిన్నది తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈసారి రాశీ ఖన్నా శర్వానంద్‌తో జతకట్టనుందన్నది సదరు వార్త సారంశం. ప్రస్తుతం ‘ఒకే ఒక జీవితం’ సినిమా షూటింగ్ పూర్తి చేసిన శర్వానంద్, త్వరలోనే కృష్ణచైతన్య దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మించనున్నారు.
ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో శర్వానంద్‌కు జోడిగా రాశీ ఖన్నా నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో శర్వా ఇప్పటి వరకు కనిపించిన పాత్రలో నటించనున్నాడని సమాచారం. ఇప్పటికే చిత్ర యూనిట్ రాశీ ఖన్నను సంప్రదించగా, ఆమె కూడా సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
ఈ నెలలో సినిమా పూజా కార్యక్రమాన్ని నిర్వహించి, వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతారని సమాచారం. ఇక ఈ సినిమాలో సరికొత్తగా కనిపించేందుకు శర్వా ప్రస్తుతం బరువు తగ్గే పనిలో ఉన్నారని టాక్ నడుస్తోంది. మరి ఈ కొత్త జోడి నిజంగానే సిల్వర్ స్క్రీన్‌పై కనిపిస్తారా.? లేదా అన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..