Vijay Devarakonda: రౌడీ హీరోతో డేటింగ్‌ చేయాలనుందన్న బాలీవుడ్‌ బ్యూటీస్‌.. విజయ్‌ రియాక్షన్‌ ఏంటంటే..

|

Jul 13, 2022 | 9:33 AM

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండకు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనతికాలంలోనే స్టార్ హీరోల సరసన చోటు దక్కించుకన్నాడు విజయ్‌. టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు...

Vijay Devarakonda: రౌడీ హీరోతో డేటింగ్‌ చేయాలనుందన్న బాలీవుడ్‌ బ్యూటీస్‌.. విజయ్‌ రియాక్షన్‌ ఏంటంటే..
Follow us on

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండకు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనతికాలంలోనే స్టార్ హీరోల సరసన చోటు దక్కించుకన్నాడు విజయ్‌. టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు ఎక్కడలేని క్రేజ్‌ సంపాదించుకున్నాడీ రౌడీ హీరో. తాజాగా లైగర్‌ చిత్రంతో తొలిసారి బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న విజయ్‌ ఇప్పటికే బీటౌన్‌లో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారాడు. కేవలం ప్రేక్షకులే కాకుండా సెలబ్రిటీలు సైతం విజయ్‌కి ఫ్యాన్స్‌గా మారిపోయారు. ముఖ్యంగా బాలీవుడ్‌ క్యూట్‌ హీరోయిన్స్‌ విజయ్‌కి ఫిదా అవుతున్నారు.

జాన్వీ కపూర్ గతంలో ఓసారి తనకు విజయ్‌తో డేటింగ్‌కు వెళ్లాలని ఉందని తెలిపిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ జాబితాలోకి నటి సారా అలీఖాన్‌ వచ్చి చేరింది. తాజాగా కాఫీ విత్‌ కరణ్‌ షోలో సారా అలీఖాన్‌, జాన్వీ కపూర్‌ ఇద్దరు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సారా మాట్లాడుతూ తనకు విజయ్‌తో డేటింగ్ చేయాలని ఉందని చెప్పుకొచ్చింది. కరణ్‌ బదులిస్తూ విజయ్‌తో డేటింగ్‌ వెళ్తాన్నది నువ్వు కదా అని జాన్వీని అడిగాడు. దీనికి సారా బదులిస్తూ.. ‘నీకు విజయ్‌ అంటే ఇష్టమా’ అని అడిగింది. ఇలా కాఫీ విత్‌ కరణ్‌ షో కొత్త ప్రోమో ఫన్నీ ఫన్నీగా సాగింది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే జాన్వీ, సారా చేసిన వ్యాఖ్యలపై రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ స్పందించాడు. ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌లో కాఫీ విత్ కరణ్‌ షో ప్రమోను పోస్ట్‌ చేస్తూ.. ‘దేవరకొండ అని నువ్వు చెప్పిన విధానానికి ఫిదా అయ్యాను. మీ ఇద్దరికి నా హగ్స్‌ అండ్‌ ఎఫెక్షన్స్‌’ అంటూ సారా అలీఖాన్‌, జాన్వీకపూర్‌లను ట్యాగ్‌ చేశాడు. ఇక జాన్వీ కపూర్.. విజయ్‌తో జోడి కట్టనున్నందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్‌తో తెరకెక్కనున్న ‘జనగణమణ’లో జాన్వీ నటించనుందని వార్తలు వచ్చినా దానిపై ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..