Jawan: అట్లీ సినిమాకు కాపీ సెగ.. జవాన్ కథను ఆ సినిమా నుంచి కాపీ చేశారంటున్న నిర్మాత

చివరిగా ఆయన జీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. చివరిగా షారుక్ హిట్ చైన్నై ఎక్స్ ప్రెస్ ఆ తర్వాత ఇంతవరకు హిట్ కొట్టలేదు బాద్షా.

Jawan: అట్లీ సినిమాకు కాపీ సెగ.. జవాన్ కథను ఆ సినిమా నుంచి కాపీ చేశారంటున్న నిర్మాత
Jawan

Updated on: Nov 06, 2022 | 8:26 PM

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ సినిమా కోసం ఆయన అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. షారుక్ సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. చివరిగా ఆయన జీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. చివరిగా షారుక్ హిట్ చైన్నై ఎక్స్ ప్రెస్ ఆ తర్వాత ఇంతవరకు హిట్ కొట్టలేదు బాద్షా. అయితే ఇటీవల బ్రహ్మాస్త్ర సినిమాలో చిన్న పాత్రలో కనిపించారు షారుక్. ఇక ఈ స్టార్ హీరో ఇప్పుడు రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వీటిలో అట్లీ దర్శకత్వంలో జవాన్ సినిమా ఒకటి. వరుసగా హిట్స్ అందుకుంటూ దూసుకుపోతోన్న తమిళ్ డైరెక్టర్ అట్లినీ పిలిచి మరి సినిమా ఛాన్స్ ఇచ్చారు షారుక్. దాంతో ఆయన కోసం ఓ భారీ కథను సిద్ధం చేశాడు ఈ టాలెంట్ డైరెక్టర్.

ఇప్పటికే ఈ సినిమానుంచి పోస్టర్స్ , టీజర్ రిలీజ్ అయ్యాయి. ఇది ప్రేక్షకుల్లో అంచనాలను భారీగా పెంచేశాయి. ఈ సినిమాలో షారుక్ సరసన లేడీ సూపర్ స్టార్ నాయన తార నటిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా కాపీ చేశారని ఓ నిర్మాత ఆరోపిస్తున్నారు. జవాన్ సినిమా  గతంలో వచ్చిన తమిళ్ సినిమా నుంచి కాపీ చేశారని అంటున్నారాయన..

అట్లీ జవాన్ పై ప్రముఖ తమిళ నిర్మాత మాణికం నారాయణన్ తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి లో ఫిర్యాదు చేసారు. విజయకాంత్ నటించిన 2006 తమిళ చిత్రం `పేరరసు`ని కాపీ చేసాడని దర్శకుడు అట్లీపై ఫిర్యాదు చేసాడు ఆయన. అట్లీపై కాపీ క్యాట్ ఫిర్యాదు నమోదవ్వడం అభిమానులను కలవరపెడుతోంది. దీని పై అట్లీ ఇంతవరకు స్పందించలేదు. ఇక ఈ సినిమాలో విలన్ గా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమానుంచి క్రేజీ అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.