బాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్ను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ప్రతి సమస్యపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి తాప్సీ వెనుకాడరు. ఏం అనుకున్నా కూడా మొహం మీదే గుద్దినట్లుగా చెబుతారు. తాజాగా ఓ రేప్ కేసులో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తాప్సీ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు గురువారం వెలువరించిన తీర్పుపై తాప్సీతోపాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
తాప్సీ పన్ను ట్వీట్ వైరల్ అవుతోంది. “ఇది మాత్రమే మిగిలింది ఇప్పుడు వినడానికి…” అంటూ తాప్సీ ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అసహనం వ్యక్తం చేసింది.
Bas ab yehi sunna baaki tha . https://t.co/K2ynAG5iP6
— taapsee pannu (@taapsee) August 26, 2021
తాప్సీ పన్నుతో పాటు గాయని సోనా మొహపాత్రా కూడా సోషల్ మీడియాలో తన కోపాన్ని వ్యక్తం చేశారు. తన ట్వీట్టర్ వేదికగా ఓ కామెంట్ జోడించారు. ఇది చదవిన తర్వాత నేను చాలా ఫీల్ అయ్యాను అంటూ అభిప్రయాన్ని వ్యక్తి చేశారు.
The sickness I feel reading this #India , is beyond anything I can write here. ??? https://t.co/uUm7l9bzxM
— Sona Mohapatra (@sonamohapatra) August 26, 2021
భార్యపై భర్త అత్యాచారానికి పాల్పడినట్టు నమోదైన ఓ కేసులో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. చట్ట ప్రకారం వివాహం చేసుకున్న భార్య ఇష్టానికి విరుద్దంగా, బలవంతంగా శృంగారం చేస్తే.. అది అత్యాచారం కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే భార్య వయసు 18 ఏళ్ల కంటే తక్కువ ఉండకూడదని కోర్టు పేర్కొంది. ఈ కేసులో భర్తను కోర్టు నిర్దోషిగా విడుదల చేస్తూ.. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తి ఎన్‌కే చంద్రవంశీ తీర్పు వెలువరించారు.
ఇవి కూడా చదవండి: E-Shram Card: అసంఘటిత రంగం కార్మికులకు ఓ వ్యవస్థ ఈ-శ్రామ్ కార్డ్.. ఇది ఎలా ఫిల్ చేయాలి.. స్టెప్ బై స్టెప్ ఇక్కడ తెలుసుకోండి