Sunny Leone: అతడిని ఎంతో ప్రేమించాను.. పెళ్లికి కొన్నిరోజుల ముందే మోసం చేశాడు.. సన్నీలియోన్ ఎమోషనల్..

ప్రస్తుతం స్ల్పిట్ విల్లా ఐదో సీజన్ హోస్ట్ గా వ్యవహరిస్తుంది. అలాగే బాలీవుడ్ సింగర్ హిమేష్ రేష్మియా ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమాలో సన్నీ లియోన్ నటిస్తుంది. ఇటీవలే ఎంటీవీలో ప్రసారం కానున్న స్ల్పిట్ విల్లా ఎపిసోడ్ లో తన ఫస్ట్ లవ్ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యింది. ఓ వ్యక్తిని ఎంతో ప్రేమించానని..కానీ పెళ్లికి రెండు నెలల ముందు తనంటే ఇష్టం లేదని వెళ్లిపోయాడని తెలిపింది.

Sunny Leone: అతడిని ఎంతో ప్రేమించాను.. పెళ్లికి కొన్నిరోజుల ముందే మోసం చేశాడు.. సన్నీలియోన్ ఎమోషనల్..
Sunny Leone

Updated on: Apr 07, 2024 | 12:58 PM

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ క్రేజ్ సొంతం చేసుకుంది సన్నీ లియోన్. స్పెషల్ సాంగ్స్ చేసి ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం, బెంగాళీ భాషలలో అనేక చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి అలరించింది. తెలుగులో మంచు మనోజ్ నటించిన కరెంట్ తీగ సినిమాలో కీలకపాత్రలో కనిపించింది. ఆమె చివరగా నటించిన తెలుగు సినిమా జిన్నా. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది సన్నీలియోన్. స్పెషల్ సాంగ్స్ కాకుండా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ మెప్పిస్తుంది. ఇక ఇప్పుడిప్పుడే బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం స్ల్పిట్ విల్లా ఐదో సీజన్ హోస్ట్ గా వ్యవహరిస్తుంది. అలాగే బాలీవుడ్ సింగర్ హిమేష్ రేష్మియా ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమాలో సన్నీ లియోన్ నటిస్తుంది. ఇటీవలే ఎంటీవీలో ప్రసారం కానున్న స్ల్పిట్ విల్లా ఎపిసోడ్ లో తన ఫస్ట్ లవ్ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యింది. ఓ వ్యక్తిని ఎంతో ప్రేమించానని..కానీ పెళ్లికి రెండు నెలల ముందు తనంటే ఇష్టం లేదని వెళ్లిపోయాడని తెలిపింది.

“పెళ్లికి ముందు ఓ వ్యక్తిని ఎంతో ప్రేమించాను.. పెళ్లి చేసుకోవాలనుకున్నాం.. నిశ్చితార్థం కూడా చేసుకున్నాం. కానీ అతడు నన్ను మోసం చేస్తున్నాడని అనిపించిచంది. వెంటనే అతడిని నేరుగా అడిగేశాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా ? అని అడిగితే లేదు అన్నాడు. నీ మీద ప్రేమ ఎప్పుడో పోయిందని చెప్పాడు. కాళ్లకింద భూమి కంపించినట్లు అయ్యింది. అప్పటికే పెళ్లి ఏర్పా్ట్లు కూడా చేశాం. అందుకు డబ్బులు కూడా చెల్లించాను. పెళ్లి వేదిక బుక్ చేశాను. కానీ అప్పటికే నేనంటే ఇష్టం లేదని వెళ్లిపోయాడు. నా జీవితంలో అత్యంత దారుణమైన సంఘటన. అప్పుడు దేవుడు డేనియల్‌ని నా జీవితంలోకి పంపాడు. నా తల్లిదండ్రులు చనిపోయినప్పటి నుంచి డేనియల్ నాతోనే ఉన్నాడు.. ఈ రోజు కూడా నాకు అండగా నిలుస్తున్నాడు. ఎప్పటికీ నా భర్త చేయిని వదలను ” అంటూ చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం సినీ పరిశ్రమలో తనకంటూ ఓ పేరు తెచ్చుకున్న సన్నీలియోన్.. సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. 2011లో డేనియల్ వెబర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరు 2017లో నిషా అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఆ మరుసటి ఏడాది సరోగసి ద్వారా ఇద్దరు అబ్బాయిలకు జన్మనిచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.