Aishwarya Rai: ‘కొంచెమైనా సిగ్గుండాలే’.. ఐష్‌పై రజాక్‌ కామెంట్స్‌ను ఖండించిన అక్తర్‌.. లెంపలేసుకున్న గుల్, అఫ్రిది

|

Nov 15, 2023 | 7:58 AM

అబ్దుల్‌ రజాక్‌ వ్యాఖ్యలను ఆపాల్సింది పోయి నవ్వుతూ మరీ చప్పట్లు కొట్టిన పాక్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిదీ, సయిద్‌ అజ్మల్‌, ఉమర్‌ గుల్‌లపై కూడా ట్రోల్స్‌ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అబ్దుల్ రజాక్‌ చేసిన అసభ్యకర కామెంట్లపై పాక్‌ స్పీడ్‌స్టర్‌ షోయబ్‌ అక్తర్‌ స్పందించాడు. ఇలాంటి చీప్‌ జోక్స్‌తో మహిళలను కించపరచడం మంచి పద్ధతి కాదంటూ రజాక్‌ వ్యాఖ్యలను ఖండించాడు

Aishwarya Rai: కొంచెమైనా సిగ్గుండాలే.. ఐష్‌పై రజాక్‌ కామెంట్స్‌ను ఖండించిన అక్తర్‌.. లెంపలేసుకున్న గుల్, అఫ్రిది
Shoaib Akhtar, Aishwarya Rai, Abdul Razzaq
Follow us on

ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్‌పై పాక్‌ మాజీ క్రికెటర్‌ అబ్దుల్ రజాక్‌ చేసిన అసభ్యకర కామెంట్లు నెట్టింట తీవ్ర చర్చకు దారి తీశాయి. అసలు క్రికెట్‌తో ఏ మాత్రం సంబంధం లేని ఐష్‌పై ఇందులోకి లాగడమే కాకుండా, చీప్‌ కామెంట్స్‌ చేసిన ఈ పాక్‌ ఆల్‌రౌండర్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే విధంగా అబ్దుల్‌ రజాక్‌ వ్యాఖ్యలను ఆపాల్సింది పోయి నవ్వుతూ మరీ చప్పట్లు కొట్టిన పాక్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిదీ, సయిద్‌ అజ్మల్‌, ఉమర్‌ గుల్‌లపై కూడా ట్రోల్స్‌ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అబ్దుల్ రజాక్‌ చేసిన అసభ్యకర కామెంట్లపై పాక్‌ స్పీడ్‌స్టర్‌ షోయబ్‌ అక్తర్‌ స్పందించాడు. ఇలాంటి చీప్‌ జోక్స్‌తో మహిళలను కించపరచడం మంచి పద్ధతి కాదంటూ రజాక్‌ వ్యాఖ్యలను ఖండించాడు. ‘అబ్దుల్‌ రజాక్‌ చెప్పిన అసంబద్దమైన జోక్‌ను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మహిళలను ఇలా కించపరచడం పద్ధతి కాదు. రజాక్‌ పక్కన కూర్చున్న వ్యక్తులు అతనిని ఆపాల్సింది పోయి నవ్వుతూ చప్పట్లు కొట్డడం సరికాదు’ అని ట్వీట్‌ చేశాడు అక్తర్‌.

 

ఇవి కూడా చదవండి

కాగా ఇదే విషయంపై షాహిద్‌ అఫ్రిదితో ఫోన్‌ లో మాట్లాడానని అతను కూడా రజాక్‌ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశాడని అక్తర్‌ మరో ట్వీట్‌లో తెలిపాడు. ‘ షాహిద్‌ అఫ్రిదీతో ఫోన్‌లో మాట్లాడాను. టీవీ చర్చలో అబ్దుల్‌ రజాక్‌ ఏం మాట్లాడాడో తనకు సరిగా అర్థం కాలేదని అఫ్రిదీ అన్నాడు. ఇలాంటి అసభ్యకరమైన మాటలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించబోమని షాహిద్‌ చెప్పాడు’ అని ట్వీట్‌లో రాసుకొచ్చాడు అక్తర్‌.

అఫ్రిదీతో మాట్లాడా..

ఇక ఇదే కార్యక్రమంలో రజాక్‌ పక్కనే కూర్చున్న ఉమర్‌ గుల్‌ కూడా స్పందించాడు. ‘రజాక్‌ వ్యాఖ్యలు వ్యంగంగా ఉన్నాయి. అతను అలా మాట్లాడడం తప్పే. అఫ్రిదీ, నేను రజాక్‌ వ్యాఖ్యలకు మద్దతుగా చప్పట్లు కొట్టలేదు’ అని ట్వీట్‌ చేశాడు గుల్.

చప్పట్లు కొట్టలేదు.. మన్నించండి..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..