వరుస పరాజయాలతో సతమవుతోన్న సమయంలో వచ్చిన పఠాన్ చిత్రం ఒక్కసారిగా షారుఖ్‌కు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. విడుదలైన తొలి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామి సృష్టిస్తోంది. అనూహ్య కలెక్షన్స్‌తో రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతోంది. విడుదలైన తర్వాత ప్రతీ రోజూ రూ. వంద కోట్లకు తగ్గకుండా బాక్సాఫీస్‌పై దండయాత్ర కొనసాగిస్తోంది. తొలి వారం పూర్తయ్యేసరికి పఠాన్ ఏకంగా రూ. 650 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది.
శనివారం కలెక్షన్స్‌తో ‘దంగల్’ రికార్డును బ్రేక్ చేసి హిందీలో అత్యధిక కలెక్షన్‌లు సాధించిన మూడో సినిమాగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. మొదటి రెండు స్థానాల్లో ‘బాహుబలి-2’, ‘కేజీఎఫ్-2’ సినిమాలున్నాయి. ఇక్కడే అనుకుంటే ఓవర్సీస్‌లోనే పఠాన్ వీర విహారం చేస్తున్నాడు. ‘ఆర్‌ఆర్ఆర్’, ‘బాహుబలి-2’ ఫుల్‌రన్‌లను జపాన్, చైనా రిలీజు లేకుండానే అధిగమించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇదే జోరు కొనసాగితే పఠాన్ వెయ్యి కోట్ల మార్కును అందుకోవడం కష్టం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Action aur entertainment ka ? combo #Pathaan is getting love across the world!Book your tickets now! https://t.co/SD17p6x9HI | https://t.co/VkhFng6vBj
Celebrate #Pathaan with #YRF50 only at a big screen near you, in Hindi, Tamil and Telugu. pic.twitter.com/5VPnM9mHTY
— Yash Raj Films (@yrf) February 4, 2023
ఈ వీకెండ్‌కు ఎలాంటి సినిమాలు లేకపోవడం కూడా పఠాన్‌కు కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. ఇక తాజాగా ఈ సినిమా రూ. 729 కోట్లు కలెక్ట్ చేసినట్లు యష్‌రాజ్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 88.92 మిలియన్ల డాలర్లతో సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. ఓవర్‌సీస్‌లోనే పఠాన్ ఏకంగా రూ. 276 కోట్లు వసూలు చేయడం విశేషం.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..