పఠాన్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించారు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్. చాలా కాలం తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమాతో అటు ఎక్కువగానే కలెక్షన్స్ రాబట్టారు. దీంతో ఇప్పుడు ఖాన్ ఫుల్ జోష్ మీదున్నారు. ఇదే సమయంలో కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బీటౌన్ కింగ్ నటించిన జవాన్ చిత్రం సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. ఉదయం నుంచే పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటున్న ఈ సినిమాకు అడియన్స్ నుంచి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఖాన్ కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఇటు భారత్ మొత్తాన్ని చుట్టేశారు షారుఖ్. చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ తోపాటు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
జవాన్ సినిమా కోసం వైష్ణో దేవి ఆలయంలో ఆశీస్సులు తీసుకున్న షారుఖ్.. ఆ తర్వాత తన కూతురు సుహానా, హీరోయిన్ నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్ తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తులు పట్టు వస్త్రాల్లో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలో షారుఖ్ తన కూతురుతో కలిసి వెళ్తున్న వీడియోస్, ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అందులో తెలుపు కుర్తా, పైజామాతో ధరించి కనిపించారు. అదే సమయంలో ఖాన్ చేతికి ఉన్న స్పెషల్ వాచ్ నెటిజన్స్ దృష్టిని ఆకర్షించింది.
షారుఖ్ ధరించిన వాచ్ రోలెక్స్ GMT మాస్టర్ II మెటోరైట్ బ్రాండ్ కు చెందినది. మెటోరైట్ డయల్ కు ప్రసిద్ధి చెందిన ఈ లగ్జరీ టైమ్ పీస్ దాదాపు రూ.51.23 లక్షలు అని తెలుస్తోంది. ఇక ఈ వాచ్ ధర తెలిసి నెటిజన్స్ షాకవుతున్నారు. మరోవైపు థియేటర్లలో జవాన్ చిత్రం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇందులో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా నటించారు. ట్రేడ్ వర్గాల ప్రకారం ఈ సినిమా తొలిరోజే రూ.100 కోట్లు రాబట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.