Aryan Khan Drugs Case: ముంబై క్రూజ్ నౌక డ్రగ్ కేసు బాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్‍ను ముంబై పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో ఎన్నో రోజులుగా విచారణ జరుగుతోంది. ఇక షారుఖ్ తనయుడి విడుదల కోసం ముమ్మర ప్రయత్నాలు జరిగాయి. ఈ క్రమంలో గురవారం ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ లభించింది. అయినప్పటికీ విడుదల ప్రక్రియ ఆలస్యమవడంతో శనివారం ఉదయం జైలు నుంచి బయటకు వచ్చాడు ఆర్యన్. అటు తన కుమారుడిని ఇంటికి తీసుకెళ్లేందుకు షారుక్.. ఆర్థర్ రోడ్ జైలుకు వచ్చారు.
డ్రగ్స్ కేసులో ఆర్యన్‍కు ముంబై హైకోక్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. అయితే అందుకు సంబంధించిన పూర్తి ఉత్తర్వులను నిన్న జారీ చేసింది. కానీ అవి సకాలంలో జైలుకు చేరకపోవడంతో శుక్రవారం రాత్రి కూడా ఆర్యన్ జైల్లోనే ఉన్నాడు. ఈ ఉదయం కోర్టు ఉత్తర్వులను పరిశీలించిన జైలు సిబ్బంది ఆర్యన్‌ను విడుదల చేశారు.
డ్రగ్స్ కేసులో అరెస్టై.. కొన్ని వారాల జైలు జీవితం తర్వాత విడుదలైన ఆర్యన్ ఖాన్.. వీడియో
#WATCH Aryan Khan released from Mumbai’s Arthur Road Jail few weeks after being arrested in drugs-on-cruise case pic.twitter.com/gSH8awCMqo
— ANI (@ANI) October 30, 2021
తన నివాసం మన్నత్‌కు చేరుకున్న ఆర్యన్ ఖాన్..
Mumbai | Aryan Khan arrives at his home ‘Mannat’ after being released from Arthur Road Jail pic.twitter.com/rgjaVLLDER
— ANI (@ANI) October 30, 2021
Also Read: Puneeth Raj Kumar: చిత్రపరిశ్రమలో తీరని విషాదం… సెట్స్ పైనున్న పునీత్ సినిమాలు ఇవే.
Bigg Boss 5 Telugu: షణ్ముఖ్‌కు ముద్దుపెట్టిన సిరి.. ఆమె బాయ్‌ఫ్రెండ్ రియాక్షన్ ఏంటంటే..
Kajol: స్టార్ హీరోయిన్ను ట్రోల్ చేస్తున్న నెటిజన్స్.. కారణం తెలిస్తే మీరు కూడా షాకవుతారు..
Bigg Boss 5 Telugu: సిరి కత్తి పెట్టుకుని గేమ్ ఆడావ్.. అసలు పాయింట్ తీసిన సన్నీ.. చివరకు..