Salman Khan: ‘ఆ ప్రదేశం ఇప్పటికీ నన్ను వెంటాడుతుంది.. గుర్తుకు వచ్చి మరీ వేధిస్తోంది’.. సల్మాన్ ఖాన్ ఎమోషనల్..

|

Apr 19, 2024 | 3:26 PM

సల్మాన్ ఇంటి దాడి ఘటనపై విచారణ వేగవంతం చేసిన ముంబై పోలీసులు ఇప్పటికే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సల్మాన్ ఖాన్‏ను ఎలాగైనా చంపేస్తామని.. ఇప్పుడు కాల్పులు జరిపింది కూడా తామే అంటూ బిష్ణో్య్ గ్యాంగ్ ప్రకటించింది. దీంతో సల్మాన్ కు మరింత భద్రత పెంచారు. గతంలో కృష్ణ జింకలను వేటాడినందుకుగానూ సల్మాన్ పై బిష్ణోయ్ గ్యాంగ్ ఈ స్థాయిలో టార్గెట్ చేసింది. అయితే వివాదాల్లో చిక్కుకోవడం సల్మా్న్ కు కొత్తేమి కాదు.

Salman Khan: ఆ ప్రదేశం ఇప్పటికీ నన్ను వెంటాడుతుంది.. గుర్తుకు వచ్చి మరీ వేధిస్తోంది.. సల్మాన్ ఖాన్ ఎమోషనల్..
Salman Khan
Follow us on

గత నాలుగైదు రోజులుగా సల్మాన్ ఖాన్ ఇంటి ముందు పోలీసుల భద్రత మరింత పటిష్టం చేశారు. ఇటీవల ఆదివారం తెల్లవారుజామున ఇద్దరు ఆగంతకులు సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో బాలీవుడ్ ఒక్కసారిగా ఊలిక్కిపడింది. సల్మాన్ ఇంటి దాడి ఘటనపై విచారణ వేగవంతం చేసిన ముంబై పోలీసులు ఇప్పటికే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సల్మాన్ ఖాన్‏ను ఎలాగైనా చంపేస్తామని.. ఇప్పుడు కాల్పులు జరిపింది కూడా తామే అంటూ బిష్ణో్య్ గ్యాంగ్ ప్రకటించింది. దీంతో సల్మాన్ కు మరింత భద్రత పెంచారు. గతంలో కృష్ణ జింకలను వేటాడినందుకుగానూ సల్మాన్ పై బిష్ణోయ్ గ్యాంగ్ ఈ స్థాయిలో టార్గెట్ చేసింది. అయితే వివాదాల్లో చిక్కుకోవడం సల్మా్న్ కు కొత్తేమి కాదు. గతంలో 2002 సెప్టెంబర్ 28న ముంబైలోని బాంద్రాలో హిట్ అండ్ రన్ కేసులోనూ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అతడికి చెందిన టయోటా ల్యాండ్ క్రూయిజర్ కారు బేకరీ సమీపంలో నిద్రిస్తున్న వ్యక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా..పలువురు గాయపడ్డారు. ఈ కేసులో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నిందితుడిగా ఉన్నాడు .నిజానికి ఈ కేసులో తన హస్తం లేదని వాదించాడు. తాను వెనుక కూర్చున్నానని, డ్రైవరే కారు నడుపుతున్నాడని పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన ప్రదేశం ఇప్పటికీ తనను వెంటాడుతుందని అన్నారు సల్మాన్.

రజత్ శర్మ ‘ఆప్ కీ అదాలత్’ కార్యక్రమానికి సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ ఇంటర్వ్యూలో హిట్ అండ్ రన్ కేసు గురించి ప్రస్తావించారు. “ఆ సంఘటన పట్ల నేను ఇప్పటికీ కలత చెందుతున్నాను. ఇంటికి వెళ్ళేటప్పుడు నాకు ఆ సంఘటన గుర్తుకు వచ్చి మరీ వేధిస్తుంది. సంఘటన జరిగిన ప్రదేశంలో నేను కుడివైపుకు తిరిగిన ప్రతిసారీ నొప్పి, ఆందోళన కలుగుతుంది. ఇంత దారుణమైన సంఘటన మరొకటి జరగదు. డ్రైవర్ కారు నడుపుతున్నాడు. కమల్,నేను వెనుక కూర్చున్నాము. రోడ్డు మీద రాయి ఉండడంతో డ్రైవర్ సడెన్ గా బ్రేక్ వేశాడు. దీంతో మా కారు స్కిట్ అయ్యింది. ” అంటూ గుర్తు చేసుకున్నారు.

అప్పుడు కారు 180-200 కి.మీ వేగంతో ప్రయాణిస్తోందని ఘటన జరిగిన ప్రదేశంలోని స్థానికులు అప్పట్లో వాదించారు. హిట్ అండ్ రన్ కేసు ఘటన అప్పట్లో పెద్ద సంచలనం రేపింది. అయితే ఇప్పుడు సల్మాన్ ఇంటిపై కాల్పులు జరగడంతో మరోసారి సల్మాన్ పాత ఇంటర్వ్యూ వీడియో నెట్టింట వైరలవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.