Pathaan: షారుఖ్‌ సినిమాను వదలనంటున్న వివాదాలు.. తాజాగా మరొకటి

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ కమ్‌ బ్యాక్‌ మూవీ పఠాన్‌.ఈ  చిత్రంలోని ‘బేషరమ్‌ రంగ్‌’ పాట విడుదలైనప్పటి నుంచి వివాదం మొదలైంది. రోజు రోజుకు వివాదాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడంలేదు.

Pathaan: షారుఖ్‌ సినిమాను వదలనంటున్న వివాదాలు.. తాజాగా మరొకటి
Pathan Movie Besharam Rang

Updated on: Dec 20, 2022 | 8:16 AM

షారుఖ్‌ సినిమా పఠాన్‌ చుట్టూ వివాదాలే. ఒకదాని తర్వాత ఒకటి.. ఒకరి తర్వాత మరొకరు కాంట్రవర్సీలను లేవనెత్తుతున్నారు. బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ కమ్‌ బ్యాక్‌ మూవీ పఠాన్‌. ఈ  చిత్రంలోని ‘బేషరమ్‌ రంగ్‌’ పాట విడుదలైనప్పటి నుంచి వివాదం మొదలైంది. రోజు రోజుకు వివాదాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడంలేదు. దీపికా ధరించిన కాషాయ రంగు బికినీపై దుమారం చెలరేగింది. సినిమాలో కాషాయ రంగును మార్చాలని పలువురు డిమాండ్‌ చేశారు. పలు హిందూ సంఘాలతో పాటు ముస్లిం సంఘాలు కూడా పఠాన్ సినిమాను బ్యాన్‌ చేయాల్సిందేనని పట్టుబడుతున్నాయి.

ఇప్పుడు ఇంకో వివాదం జాతీయ మానవ హక్కుల కమిషన్‌ వరకు వెళ్లింది. ఆర్టీఐ కార్యకర్త డానిష్‌ ఖాన్‌ ‘బేషరమ్‌ రంగ్‌’పై NHRCకి ఫిర్యాదు చేశారు. పాటను సినిమా నుంచి తొలగించేలా ఆదేశించాలని కోరారు. కాషాయ రంగుకు ముస్లిం సమాజంలో ఎంతో ప్రాధాన్యం ఉందని.. ఇది ముస్లిం సమాజానికి చిస్తీ రంగంటున్నారు. పాట సైతం హిందూ – ముస్లింల ఐక్యత, మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఫిర్యాదుచేశారు.

ఇవి కూడా చదవండి

పఠాన్‌ సినిమాపై మధ్యప్రదేశ్‌ హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రా గతంలోనే ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీపికా కాషాయ రంగు బికినీ ధరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత విశ్వహిందూ పరిషత్‌, వీర్‌ శివాజీ గ్రూప్‌లు సైతం మండిపడ్డాయి. దాదాపు నాలుగేళ్ల తర్వాత షారుఖ్‌ ఖాన్‌ నటిస్తున్న చిత్రం పఠాన్‌. వచ్చే ఏడాది జనవరి 25న విడుదల చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు.