
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆమె వివాహం ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు రాఘవ్ చద్దాతో జరగనుంది. సెప్టెంబర్ 23, 24 తేదీల్లో వీరి వివాహ వేడుక జరగనుంది. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. పరిణీతి చోప్రా, ప్రియాంక చోప్రా దగ్గరి బంధువులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు బీటౌన్ లో నెలకొన్న సందేహం ఏంటంటే.. పరిణీతి పెళ్లికి ప్రియాంక చోప్రా వస్తుందా ?.. అని.. ఇప్పటివరకు అభిమానులు ఆమె వస్తుందనే ఊహించారు. కానీ కొన్ని ఇప్పుడు నెట్టింట వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ప్రియాంక చోప్రా రావడం లేదా ?.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఉదయ్‌పూర్‌లో పరిణీతి చోప్రా – రాఘవ్ చద్దా పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి .
ప్రియాంక చోప్రా అమెరికాలో స్థిరపడింది. సింగర్ నిక్ జోనాస్‌తో పెళ్లి తర్వాత ఆమెకు బాలీవుడ్‌తో పెద్దగా సంబంధాలు లేవు. వారు కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే భారతదేశానికి వస్తారు. ప్రియాంక ఇప్పుడు హిందీ సినిమాలను కూడా అంగీకరించడం లేదు. ప్రియాంక చోప్రా తన సోదరి వివాహానికి హాజరవుతుందా లేదా అనే ప్రశ్న తలెత్తింది. అందుకు కారణం ఇప్పటికే ఆమె ఒప్పుకున్న చిత్రాల షూటింగ్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది.
మరోవైపు పరిణీతి చోప్రా ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇందులో ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా పాల్గొంటున్నారు. ప్రియాంక చోప్రా వస్తుంటే ఈపాటికి ఇండియాలో అడుగుపెట్టి ఉండాల్సింది. పెళ్లికి రాలేనన్న కారణంతో నిశ్చితార్థానికి వచ్చి వెళ్లిపోయిందని.. ఇప్పుడు అమెరికా నుంచి వచ్చిన నూతన వధూవరులకు అభినందనలు తెలుపుతుందని అంటున్నారు. ఈ విషయమై కుటుంబ సభ్యుల నుండే అధికారిక సమాచారం అందాల్సి ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.