Pooja Hegde: ఒక లైలా కోసం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ పూజ హెగ్డే. తొలి సినిమాతోనే కుర్రాళ్ళ మనసు దోచేసింది. తక్కువ కాలంలోనే పూజాహెగ్డే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకుంది. ఒక లైలా కోసం సినిమా తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ముకుంద సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది ఈ అమ్మడు. ఈ రెండు సినిమాల్లో పక్కింటి అమ్మాయిలా కనిపించి ఆకట్టుకున్న పూజా.. ఆతర్వాత వచ్చిన అల్లు అర్జున్ డీజే సినిమాలో హాట్ హాట్ అందాలతో మతిపోగొట్టింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఏకంగా బికినిలో దర్శమిచ్చి అందరు అవాక్ అయ్యేలా చేసింది. ఇక తర్వాత ఈ అమ్మడికి వరుసగా ఆఫర్లు తలుపు తట్టాయి. ఆ తర్వాత రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది ఈ భామ.
ఇక పూజ హెగ్డే నటించిన తారక్ అరవింద సమేత వీర రాఘవ, మహేష్ బాబు మహర్షి, వరుణ్ తేజ్ నటించిన గద్దల కొండ గణేష్, అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలతో భారీ విజయాలను అందుకుంది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు టాలీవుడ్ కు లక్కీ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం పూజ చేతిలో బడా బడా సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రభాస్ సరసన పూజా నటించిన రాధేశ్యామ్ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. అలాగే మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రాబోతున్న సినిమాలోనూ హీరోయిన్ గా ఎంపిక అయ్యింది పూజా. ఇదిలా ఉంటే.. ఈ అమ్మడు బాలీవుడ్ లోనూ తన సత్తా చాటిన విషయం తెలిసిందే.. అక్కడ హృతిక్ రోషన్ నటించిన మొహెంజో దారో, అక్షయ్ కుమార్ నటించిన హౌస్ ఫుల్ 4 సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఇప్పుడు సల్మాన్ ఖాన్ నటించిన భాయ్ జాన్ సినిమాలో నటిస్తుంది పూజా.. ఇదిలా ఉంటే ఇప్పుడు అక్కడ ఈ అమ్మడి మరో అద్భుతమైన ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది. పూజాతో ‘యానిమల్’ అనే సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేయించడానికి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ట్రై చేస్తున్నాడట. ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్ – పరిణీతి చోప్రా నటిస్తున్నారు. అనిల్ కపూర్ కూడా ఈ సినిమాలో కీలకమైన పాత్రను చేస్తుండటం విశేషం. మరి ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కు పూజా గ్రీన్ సిగ్నల్ ఇస్తుందేమో చూడాలి.
మరిన్ని ఇక్కడ చదవండి :