Ravi Teja: ఖిలాడీతో బాలీవుడ్ లో అడుగు పెట్టనున్న మాస్ మహారాజా రవితేజ.. హిందీ ప్రేక్షకులను కూడా నవ్విస్తాడంటున్న నిర్మాతలు..

|

Feb 05, 2022 | 9:04 PM

Ravi Teja: తెలుగు సినిమాలు(Telugu Movies) తన పరిధిని మార్కెట్ ను పెంచుకోవడానికి పాన్ ఇండియా మూవీస్ పై దృష్టి పెట్టాయి.  తెలుగు సినిమాలను కోలీవుడ్(Kollywood ) లో డబ్ చేసి రిలీజ్ చేసేవారు.. అదే సమయంలో..

Ravi Teja: ఖిలాడీతో బాలీవుడ్ లో అడుగు పెట్టనున్న మాస్ మహారాజా రవితేజ.. హిందీ ప్రేక్షకులను కూడా నవ్విస్తాడంటున్న నిర్మాతలు..
Khiladi
Follow us on

Ravi Teja: తెలుగు సినిమాలు(Telugu Movies) తన పరిధిని మార్కెట్ ను పెంచుకోవడానికి పాన్ ఇండియా మూవీస్ పై దృష్టి పెట్టాయి.  తెలుగు సినిమాలను కోలీవుడ్(Kollywood ) లో డబ్ చేసి రిలీజ్ చేసేవారు.. అదే సమయంలో హిందీలో కూడా డబ్ చేసి యూ ట్యూబ్ లో విడుదల చేసేవారు. ఆ సినిమాలను ఉత్తారదివారు బ్రహ్మరధం పడుతుండడంతో.. లక్షలాది వ్యూస్ ను సొంతం చేసుకుంటున్నాయి. దీంతో టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రస్తుతం తెరకెక్కిస్తున్న సినిమాలను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా మాస్ మహారాజా రవితేజ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ ఖిలాడీ ‘ హిందీ భాషలో రిలీజ్ చేయడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఫిబ్రవరి 11 న ఖిలాడీ విడుదల చేయనున్నారు. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖిలాడీ మూవీ ఏ స్టూడియోస్‌, పెన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రవితేజ భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి , డింపుల్ హయాతి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

“కాలం మారింది.. ఇప్పుడు అసలు కంటెంట్‌కు మంచి డిమాండ్ ఉంది, ఎందుకంటే ప్రేక్షకులు చిత్రాన్ని ఒరిజినల్ వెర్షన్ లోనే చూడటానికి ఇష్టపడుతున్నారు అని డాక్టర్ జయంతిలాల్ చెప్పారు. రవితేజకు ఉన్న పాపులారిటీ, ఖిలాడీలోని కంటెంట్ భారతదేశం అంతటా వినోదాన్ని పంచుతుంది. దీంతో పెన్ స్టూడియోస్ ఖిలాడీ చిత్రాన్ని హిందీ భాషలో కూడా సినిమాలలో విడుదల చేయాలని భావించిందన్నారు.

ఈ చిత్రాన్ని ఎ స్టూడియోస్‌తో కలిసి డాక్టర్ జయంతిలాల్ గడా (పెన్ స్టూడియోస్) సమర్పిస్తున్నారు. ఈ చిత్రాన్ని సత్యనారాయణ కోనేరు నిర్మించారు. ‘ఖిలాడీ’లో నికితిన్ ధీర్, సచిన్ ఖేడేకర్, ముఖేష్ రిషి, ఠాకూర్ అనూప్ సింగ్, రావు రమేష్, మురళీ శర్మ , అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు

Also Read:  సమాజంలో పెద్దవారిగా గౌరవించాలంటే.. కేవలం వయస్సు మాత్రమే కాదు.. ఈ పనులు చేయాలంటున్న చాణక్య