
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ దర్శకులలో నితేష్ తివారీ ఒకరు. ఆయన దర్శకత్వంలో పాన్-ఇండియన్ పౌరాణిక కథా చిత్రంగా రామాయణం రూపొందుతోంది. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ యశ్ రావణుడిగా కనిపించనున్నాడు. అలాగే పంచదరా బొమ్మ కాజల్ అగర్వాల్ మండోదరి పాత్రను పోషిస్తుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ అద్భుతంగా అనిపిస్తుంది. రామాయణాన్ని విజివాల్ వండర్ గా కళ్లకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేశారు మేకర్స్.
ఇక రాముడిగా రణబీర్ కపూర్ అద్భుతంగా నటించారు. అలాగే సీతగా సాయి పల్లవి ఆకట్టుకుంది. అదేవిధంగా రావణాసురిడిగా యష్ అదరగొట్టాడు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు కనీ వినీ ఎరుగని రీతిలో దాదాపు రూ.4,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ‘రామాయణ’ రూపొందుతోంది. ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, గ్లోబల్ మార్కెట్‌లో భారతీయ సినిమా సత్తాను చూపించే ప్రయత్నం. ఆస్కార్ విజేత హ్యాన్స్ జిమ్మర్ సంగీతం, హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ వంటి అంశాలు ఈ చిత్రాన్ని అంతర్జాతీయ ఆడియన్స్‌కు కూడా చేరువ చేస్తున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి