Abdul Razzaq: ‘నోరు జారాను.. మన్నించండి’.. ఐశ్వర్యారాయ్‌కు బహిరంగ క్షమాపణలు చెప్పిన అబ్దుల్‌ రజాక్‌

|

Nov 15, 2023 | 12:44 PM

బాలీవుడ్‌ అందాల తార ఐశ్వర్యారాయ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాక్‌ మాజీ క్రికెటర్‌ అబ్దుల్‌ రజాక్‌ ఎట్టకేలకు దిగొచ్చాడు. తోటి క్రికెటర్లు, అభిమానులు, నెటిజన్లు.. ఇలా అందరూ అతనిని తప్పుపట్టడంతో చివరికి క్షమాపణలు చెప్పాడు. అతనితో పాటు షాహిద్‌ అఫ్రిదీ, ఉమర్‌ గుల్ కూడా తప్పు జరిగిపోయిందంటూ లెంపలేసుకున్నారు.

Abdul Razzaq: నోరు జారాను.. మన్నించండి.. ఐశ్వర్యారాయ్‌కు బహిరంగ క్షమాపణలు చెప్పిన అబ్దుల్‌ రజాక్‌
Abdul Razzaq, Aishwarya Rai
Follow us on

బాలీవుడ్‌ అందాల తార ఐశ్వర్యారాయ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాక్‌ మాజీ క్రికెటర్‌ అబ్దుల్‌ రజాక్‌ ఎట్టకేలకు దిగొచ్చాడు. తోటి క్రికెటర్లు, అభిమానులు, నెటిజన్లు.. ఇలా అందరూ అతనిని తప్పుపట్టడంతో చివరికి క్షమాపణలు చెప్పాడు. అతనితో పాటు షాహిద్‌ అఫ్రిదీ, ఉమర్‌ గుల్ కూడా తప్పు జరిగిపోయిందంటూ లెంపలేసుకున్నారు. ప్రపంచకప్‌లో పాక్‌ క్రికెట్‌ జట్టు ప్రదర్శనకు సంబంధించి ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్నాడు అబ్దుల్ రజాక్‌. అతనితో పాటు పాక్‌ మాజీ క్రికెటర్లు షాహిద్‌ అఫ్రిది, ఉమర్‌ గుల్, సయీద్‌ అజ్మల్, షోయబ్‌ మాలిక్‌, అక్మల్‌తో పాటు పెద్ద ఎత్తున జర్నలిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే బాబర్‌ సేన ప్రదర్శనపై మాట్లాడిన రజాక్‌ అనవసరంగా మధ్యలో ఐశ్వర్యారాయ్‌ ప్రస్తావన తీసుకొచ్చాడు. ఆమెపై అసభ్యకర రీతిలో జోక్స్‌ వేశాడు. పక్కనే ఉన్న అఫ్రిదీ, అజ్మల్‌ రజాక్‌ను ఆపాల్సింది పోయి నవ్వుతూ మరీ చప్పట్లు కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో ఒక్కసారిగా పాక్‌ క్రికెటర్లపై విమర్శలు వెల్లువెత్తాయి. స్వయంగా పాక్‌ మాజీ స్పీడ్‌స్టర్‌ షోయబ్‌ అక్తర్‌ రజాక్‌ వ్యాఖ్యలను తప్పుపట్టాడు. మహిళలను కించపరిచడం మంచి పద్దతి కాదంటూ రజాక్‌తో పాటు అఫ్రిది, గుల్‌ను తిట్టపోశాడు. దీంతో ఇప్పటికే ఉమర్‌ గుల్, అఫ్రిదీ ఐష్‌పై కామెంట్స్‌ విషయంలో తప్పు జరిగిపోయిందంటూ లెంపలువేసుకున్నారు. తాజాగా ఈ వివాదానికి మూల కారకుడైన అబ్దుల్‌ రజాక్‌ కూడా క్షమాపణలు చెప్పాడు.

 

ఇవి కూడా చదవండి

‘మంగళవారం (నవంబర్‌ 14) జరిగిన ఓ కార్యక్రమంలో క్రికెట్‌ కోచింగ్‌, దాని ఉద్దేశాలను గురించి మాత్రమే మాట్లాడాను. అయితే అనవసరంగా నోరుజారి ఐశ్వర్యారాయ్‌ పేరును ప్రస్తావించాను. ఇందుకు గానూ ఆమెకు నేను వ్యక్తిగతంగా క్షమాపణలు చెబుతున్నాను. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం నాకు లేదు’ అని చెప్పుకొచ్చాడు రజాక్‌. ఇదిలా ఉంటే మహిళలపై అసభ్యకర కామెంట్లు చేయడం అబ్దుల్ రజాక్‌కు ఇదేమి మొదటి సారి కాదు. గతంలో పాక్‌కు చెందిన ఓ మహిళా క్రికెటర్‌పై కూడా ఇలాగే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. అప్పట్లో కూడా రజాక్‌ను అందరూ తిట్టేశారు. అయినా ఈ పాక్‌ ఆల్‌రౌండర్‌ వైఖరిలో ఏ మాత్రం మార్పు రావడం లేదు.

షోయబ్ అక్తర్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..