Naga Chaitanya : అక్కినేని యంగ్ హీరో బాలీవుడ్ డెబ్యూ మూవీ వాయిదా పడింది.. కారణం ఇదే..

|

Jun 09, 2021 | 6:16 PM

జోష్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు అక్కినేని వారసుడు నాగచైతన్య. మొదటి సినిమాతోనే నటన పరంగా మంచి మార్కులు కొట్టేసిన ఈ యంగ్ హీరో ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ నటనను మెరుగుపరుస్తూ వస్తున్నాడు.

Naga Chaitanya : అక్కినేని యంగ్ హీరో బాలీవుడ్ డెబ్యూ మూవీ వాయిదా పడింది.. కారణం ఇదే..
Naga Chaitanya
Follow us on

Naga Chaitanya :

జోష్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు అక్కినేని వారసుడు నాగచైతన్య. మొదటి సినిమాతోనే నటన పరంగా మంచి మార్కులు కొట్టేసిన ఈ యంగ్ హీరో ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ నటనను మెరుగుపరుస్తూ వస్తున్నాడు. ఏం మాయచేసావే సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు చైతన్య. ఆ తర్వాత హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇటీవల మజిలీ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న చైతన్య ఇప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్నాడు చైతన్య. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల మందుకు రానుంది. ఈ సినిమాలో చైతన్య కు జోడీగా సాయి పల్లవి నటిస్తుంది. అలాగే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు చైతన్య. ఈ సినిమాకు థాంక్యూ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. హాకీ క్రీడ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని తెలుస్తుంది.

థాంక్యూ మూవీ ఇటలీలో మెయిన్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. అయితే థాంక్యూ మూవీ షూటింగ్ పూర్తికాగానే వెంటనే నాగచైతన్య బాలీవుడ్ డెబ్యూ ఫిల్మ్ ‘లాల్ సింగ్ చద్దా’ షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ నటిస్తున్నారు. అయితే ‘లాల్ సింగ్ చద్దా’ మూవీలో నాగచైతన్య ఓ కొత్త లుక్లో కనిపించనున్నట్లు తెలుస్తుంది. అలాగే చైతూ పార్ట్ మొత్తం లడఖ్ లో షూట్ చేయనున్నారట. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ షెడ్యూల్ క్యాన్సిల్ అయ్యిందంట. కరోనా సమయంలో రిస్క్ వద్దని అమీర్ ఖానే ఈ షెడ్యూల్ ను క్యాన్సిల్ చేసారని తెలుస్తుంది. కరోనా ప్రభావం తగ్గిన వెంటనే తిరిగి షూటింగ్ ప్రారంభించనున్నారట.

మరిన్ని ఇక్కడ చదవండి :

PSPK 28: ప‌వ‌ర్ స్టార్ రేంజ్ అంటే ఇది… పీఎస్‌పీకే 28 నేషనల్ లెవల్‌లో ట్రెండింగ్

Maruthi : మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్ సినిమా.. హీరోయిన్ గా నటించనున్న అందాల భామ