Raj Kundra: నీలి చిత్రాల కేసులో బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్తకు ఊరట.. బెయిల్‌ మంజూరు చేసిన ముంబై కోర్టు

|

Sep 20, 2021 | 9:23 PM

పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయిన నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు ముంబై కోర్టు బెయిల్‌ ఇచ్చింది. రూ. 50 వేల పూచికత్తుపై ఆయనకు బెయిల్‌ మంజూరయ్యింది.

Raj Kundra: నీలి చిత్రాల కేసులో బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్తకు ఊరట.. బెయిల్‌ మంజూరు చేసిన ముంబై కోర్టు
Raj Kundra
Follow us on

నీలిచిత్రాల కేసులో అరెస్టయిన బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు ఊరట లభించింది.పోర్నోగ్రఫీ కేసులో రాజ్‌కుంద్రాకు ఎట్టకేలకు బెయిల్‌ మంజూరయ్యింది. 50 వేల రూపాయల పూచికత్తుపై బెయిల్‌ మంజూరయ్యింది. ముంబై కోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. అరెస్టయిన రెండు నెలల తరువాత రాజ్‌కుంద్రాకు బెయిల్‌ లభించింది. పోర్నోగ్రఫీ కేసులో రాజ్‌కుంద్రా ప్రధాన నిందితుడు.  పోర్నోగ్రఫీ కేసులో రాజ్‌కుంద్రా ప్రధాన నిందితుడని ముంబై క్రైంబ్రాంచ్‌ చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. షార్ట్‌ ఫిల్మ్స్‌ , వెబ్‌సిరీస్‌లో అవకాశాలు ఇప్పస్తానని చెప్పి అమాయక యువతులను రాజ్‌కుంద్రా ట్రాప్‌ చేసినట్టు దర్యాప్తులో వెల్లడయ్యింది. వాళ్లతో బలవంతంగా బూతు చిత్రాల్లో యాక్టింగ్‌ చేయించినట్టు ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. పోర్నోగ్రఫీ కేసులో జులై 19వ తేదీన అరెస్టయ్యాడు రాజ్‌కుంద్రా. ఈ కేసులో శిల్ఫాశెట్టిని కూడా ముంబై క్రైంబ్రాంచ్‌ పోలీసులు విచారించారు. అయితే తనకు ఈ వ్యవహారంతో సంబంధం లేదని శిల్పాశెట్టి పోలీసులకు తెలిపారు.

తాను నేరం చేసినట్టు ఒక్క ఆధారం కూడా లేదని.. ఈ కేసులో బలిపశువును చేశారని రాజ్‌కుంద్రా బెయిల్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఐటీ చట్టం కింద అరెస్టయ్యారు రాజ్‌కుంద్రా. పోర్న్‌ యాప్‌ను రూపొందించి అందులో అశ్లీల చిత్రాలు అప్‌లోడ్‌ చేసినట్టు రాజ్‌కుంద్రాపై కేసు నమోదయ్యింది. ఎలాంటి సాక్ష్యాలు లేకుండానే చార్జ్‌షీట్‌ దాఖలు చేశారని ఆరోపించారు రాజ్‌కుంద్రా. ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు లేనప్పటికి పోలీసులు కక్షపూరితంగా కేసు పెట్టారని ఆరోపించారు రాజ్‌కుంద్రా.

ఇవి కూడా చదవండి: Hyderabad: దూసుకుపోతున్న హైదరాబాద్.. ఢిల్లీ, ముంబై ఆ తర్వాత మనమే.. ఎందులోనో తెలుసా..

PAN Aadhaar Linking: పాన్-ఆధార్ లింక్ చేయకపోతే ఈ 5 నష్టాలు తప్పవు.. ఇందులో ఇవి చాలా ముఖ్యం..