Madhuri Dixit: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా ఆసనాలు వేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అవగాహన పెంచడానికి మాధురి దీక్షిత్ సోషల్ మీడియా వేదికగా కొన్ని వీడియోలను షేర్ చేసింది. జూన్ 21 న జరుపుకునే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి కౌంట్‌డౌన్ ప్రారంభించింది మాధురి. అంతేకాదు.. ప్రతిరోజూ ఒక యోగా భంగిమను ప్రదర్శిస్తూ.. తన అభిమానులకు వ్యాయామం చేయమని.. యోగాను ఒక దినచర్యగా మార్చుకోమని కోరుతున్నారు మాధురి.
మాధురి దీక్షిత్ ఈ రోజు సోషల్ మీడియా వేదికగా యోగా చేస్తున్న ఓ వీడియో షేర్ చేశారు. తులాసనాన్ని వేస్తున్న వీడియో అభిమానులతో పంచుకున్నారు. ఈ ఆసనం చేతులతో శరీరాన్ని సమతుల్యం చేసే ఆసనం ఇది మన శరీరం యొక్క ప్రధాన బలాన్ని నియంత్రిస్తుంది మరియు సమతుల్యతను పెంచుతుంది.
ఈ ఆసనం వేయు భంగిమలను వివరిస్తూ.. దానివలన కలిగే వివిధ ప్రయోజనాలు కూడా వివరించారు మాధురి. చేతులు, మణికట్టు, పై శరీరం మరియు భుజాలను బలోపేతం చేయడానికి తులసన సహాయపడుతుందని ఆమె అన్నారు. ఇది కండరాలకు శక్తినివ్వడానికి మరియు మనస్సును శాంతపరచడానికి సరైన భంగిమమని అన్నారు. తన అభిమానులను తనతో పాటు యోగాసనాలను వేయమని కోరారు.
యోగా చాప మీద పద్మాసన లేదా తామర భంగిమలో కూర్చోవడం ద్వారా ఆసనాన్ని ప్రారంభించారు మాధురి. ఆమె తన చేతులను తన హిప్ ప్రాంతంతో ఉంచి రెండు అరచేతులను నేలపై నొక్కారు. ఆమె చేతులను నిటారుగా ఉంచి, ఆమె పైభాగాన్ని ఎత్తి, చేతులపై ఉన్న బరువును సమతుల్యం చేశారు.
మాధురి దీక్షిత్ వేసిన ఈ ఆసనం అభ్యసించడం ద్వారా ఊపిరి తిత్తులకు ఆక్సిజన్ సరఫరాను కూడా మెరుగుపడుతుంది. అయితే మాధురి దీక్షిత్ ఇంతకూ ముందు భుజంగాసన, ధనురాసన మరియు యోగా ముద్ర ఆసన చేస్తున్న వీడియోలను సోషల్ మీడియా లో శ్రీ చేశారు.
Also Read: కాలం, గాలి రెండు నావైపే ఉన్నాయి .. ఇప్పుడు టైం నాది అంటున్న మోనిత