Kriti Sanon : అలవైకుంఠపురంలో సినిమా బాలీవుడ్ రీమేక్ లో మహేష్ హీరోయిన్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ అల వైకుంఠపురంలో.. ఈ సినిమాలో త్రివిక్రమ్ మాటలకు బన్నీ యాక్టింగ్ కు అభిమానులు ఫిదా అయిపోయారు.

Kriti Sanon :  అలవైకుంఠపురంలో సినిమా బాలీవుడ్ రీమేక్ లో మహేష్ హీరోయిన్..!
Krithi Sanan

Updated on: Mar 19, 2021 | 4:22 PM

ala vaikunthapurramuloo bollywood remake : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ అల వైకుంఠపురంలో.. ఈ సినిమాలో త్రివిక్రమ్ మాటలకు.. బన్నీ యాక్టింగ్ కు అభిమానులు ఫిదా అయిపోయారు. ఇక తమన్ అందించిన సంగీతం సినిమాను మరో లెవల్ కు తీసుకువెళ్ళింది. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బన్నీ కెరియర్ లో ఒక మైలు రాయిగా నిలిచిపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ ఈ సినిమాను రీమేక్ చేయాలనీ చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నారు దర్శక నిర్మాతలు.

అలవైకుంఠపురంలో సినిమా బాలీవుడ్ రీమేక్ హక్కులను అశ్విన్ వర్దె దక్కించుకున్నారు. అలాగే ఈ సినిమాకు రోహిత్ ధావన్ దర్శకత్వం వహించనున్నాడని వార్తలు వినిపించాయి. హిందీ రీమేక్ లో యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ బన్నీ ప్లేస్ లో ఓకే అయ్యాడు. అయితే బుట్టబొమ్మ పూజ హెగ్డే పాత్ర ఎవరు చేస్తున్నారన్న దాని పై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. గతంలో చాలా పేర్లు వినిపించాయి. తాజాగా అందాల భామ కృతి సనన్ పేరు వినిపిస్తుంది. ఈ అమ్మడు తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆతర్వాత బాలివుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే ఇటీవలే రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ లో హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. ఆదిపురుష్ లో కృతిసనన్ సీత పాత్రలో కనిపించనుంది. ఇక ఇదివరకు కార్తీక్ కృతి కలిసి ‘లుక్కాచుప్పి’అనే సినిమాలో నటించారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Acharya Movie: ‘ఆచార్య’ సినిమా నిజంగా అలా ఉంటుందా ?.. అసలు విషయం బయట పెట్టిన మెగాస్టార్..

Keerthy Suresh: యాప్‌తో యంగ్ హీరో నితిన్‌ని ప్రతీకారం తీర్చుకున్న కీర్తి సురేష్…!! (వీడియో)