Kaun Banega Crorepati : కౌన్ బనేగా కరోడ్‌పతి రికార్డ్ క్రియేట్ చేసిన 14 ఏళ్ల బాలుడు..

తాజాగా  'కౌన్ బనేగా కరోడ్‌పతి' షోలో 14 ఏళ్ల బాలుడు కోటీశ్వరుడయ్యాడు. షో చరిత్రలో కోటి రూపాయలను గెలుచుకున్న అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు ఆ బాలుడు. ఈ అబ్బాయి పేరు మయాంక్. అతను హర్యానాకు చెందినవాడు. మయాంక్ కేబీసీలో కోటి రూపాయలు గెలుచుకున్నాడు. ప్రత్యేక KBC జూనియర్ వీక్ సందర్భంగా మయాంక్ పోటీదారుగా పాల్గొన్నారు

Kaun Banega Crorepati : కౌన్ బనేగా కరోడ్‌పతి రికార్డ్ క్రియేట్ చేసిన 14 ఏళ్ల బాలుడు..
Kbc

Updated on: Nov 29, 2023 | 6:52 PM

హిందీలో స్టార్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా చేస్తోన్న గేమ్ షో కౌన్ బనేగా కరోడ్‌పతి. ఈ షో ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ షో చాలా సీజన్స్ పూర్తి చేసుకుంది. తాజాగా  ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షోలో 14 ఏళ్ల బాలుడు కోటీశ్వరుడయ్యాడు. షో చరిత్రలో కోటి రూపాయలను గెలుచుకున్న అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు ఆ బాలుడు. ఈ అబ్బాయి పేరు మయాంక్. అతను హర్యానాకు చెందినవాడు. మయాంక్ కేబీసీలో కోటి రూపాయలు గెలుచుకున్నాడు. ప్రత్యేక KBC జూనియర్ వీక్ సందర్భంగా మయాంక్ పోటీదారుగా పాల్గొన్నారు. మంగళవారం నాటి ఎపిసోడ్‌లో హర్యానాలోని మహేంద్రగఢ్‌కు చెందిన మయాంక్ పాల్గొన్నారు.

8వ తరగతి చదువుతున్న మయాంక్ టాలెంట్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అతను రూ. 3.2 లక్షల వరకు ఒక్క లైఫ్‌లైన్‌ను కూడా ఉపయోగించలేదు. ఆ తర్వాత రూ. 12.5 లక్షల ప్రశ్న కోసం మొదటిసారి లైఫ్‌లైన్‌ని ఉపయోగించాడు.

కోటి రూపాయల మెగా ప్రశ్నకు సమాధానం ఇవ్వడంతో మయాంక్ కళ్లలో నీళ్లు తిరిగాయి. ‘కొత్తగా కనుగొన్న అమెరికా అనే ఖండం మ్యాప్‌ను రూపొందించిన ఘనత ఏ యూరోపియన్ కార్టోగ్రాఫర్‌కు దక్కుతుంది’ అనే ప్రశ్నను అడిగారు. ఇందుకోసం అతనికి నాలుగు ఆప్షన్లు ఇచ్చారు.  A- అబ్రహం ఒర్టెలియస్, B- గెరాడస్ మెర్కేటర్, C- గియోవన్నీ బాటిస్టా అగ్నిసి,D- మార్టిన్ వాల్డ్సిముల్లర్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం మార్టిన్ వాల్డ్‌సీముల్లర్. మయాంక్ దీనికి సరైన సమాధానం చెప్పి కోటి రూపాయలను గెలుచుకున్నాడు. ఆ తర్వాత ఏడు కోట్ల రూపాయల ప్రశ్న అడిగారు. కానీ సరైన సమాధానం తెలియకపోవడంతో ఆట నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు.

కోటి రూపాయలు గెలుచుకున్న మయాంక్‌ను హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా అభినందించారు. విజయం గురించి మయాంక్ మాట్లాడుతూ, “కెబిసిలో అతి పిన్న వయస్కుడైన కంటెస్టెంట్ కావడం, ఇంత పెద్ద మొత్తంలో గెలవడం నాకు , నా కుటుంబానికి చాలా గర్వకారణం. ఎల్లప్పుడూ నన్ను నడిపిస్తున్నందుకు నా తల్లిదండ్రులకు నేను కృతజ్ఞతలు చెప్తున్నా.. అదేవిధంగా, అమితాబ్ బచ్చన్ సార్ ఈ గేమ్‌లో ఎప్పుడూ నన్ను ప్రోత్సహిస్తున్నారు, కాబట్టి నేను ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అన్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.