Amitabh Bachchan: అమితాబ్ తన కూతురికి ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా.? శ్వేతకు కానుకగా ప్రతీక్ష.
ఆ నటుడు కొనుగోలు చేసిన మొదటి ఆస్తి ఆ బంగ్లా. ఇప్పుడు కోట్లు విలువ చేస్తుంది.. ఆ బంగ్లాను తన గారాల తనయకు బహుమతిగా ఇచ్చేసారు. ఇంతకీ ఎవరా నటుడు అంటారా? అమితాబ్ తన కూతురు శ్వేత నందాకి కోట్లు విలువ చేసే బంగ్లాను కానుకగా ఇచ్చిన వార్త ఆసక్తికరంగా మారింది. ముంబయి జుహులో ఉన్న ‘ప్రతీక్ష’ బంగ్లాను శ్వేతకు రాసిచ్చారు. అమితాబ్ కొనుగోలు చేసిన మొదటి ఇల్లు ‘ప్రతీక్ష’. ఆ ఇంట్లో అమితాబ్ తన తల్లిదండ్రులు లెజెండరీ కవి హరివంశ్ రాయ్ బచ్చన్, తేజీ బచ్చన్‌లతో ఉండేవారు.
ఆ నటుడు కొనుగోలు చేసిన మొదటి ఆస్తి ఆ బంగ్లా. ఇప్పుడు కోట్లు విలువ చేస్తుంది.. ఆ బంగ్లాను తన గారాల తనయకు బహుమతిగా ఇచ్చేసారు. ఇంతకీ ఎవరా నటుడు అంటారా? అమితాబ్ తన కూతురు శ్వేత నందాకి కోట్లు విలువ చేసే బంగ్లాను కానుకగా ఇచ్చిన వార్త ఆసక్తికరంగా మారింది. ముంబయి జుహులో ఉన్న ‘ప్రతీక్ష’ బంగ్లాను శ్వేతకు రాసిచ్చారు. అమితాబ్ కొనుగోలు చేసిన మొదటి ఇల్లు ‘ప్రతీక్ష’. ఆ ఇంట్లో అమితాబ్ తన తల్లిదండ్రులు లెజెండరీ కవి హరివంశ్ రాయ్ బచ్చన్, తేజీ బచ్చన్‌లతో ఉండేవారు. హరివంశ్ రాయ్ బచ్చన్ ఆ ఇంటికి ‘ప్రతీక్ష’ అని పేరు పెట్టారట. అమితాబ్ శ్వేతకు గిఫ్ట్‌గా ఇచ్చిన బంగ్లా జుహులోని విఠల్ నగర్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ పరిధిలోకి వస్తుంది. ఈ బంగ్లా రెండ్లు ప్లాట్లుగా ఉంటుంది. ఈ ఆస్తి విలువ రూ. 50 కోట్లు ఉంటుందని అంచనా. ప్రతీక్ష బంగ్లా ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ ఉంటున్న ‘జల్సా’ ఇంటికి ఒక కిలోమీటర్ దూరంలో ఉంది. అమితాబ్ తన కుమార్తెకు బహుమతిగా నవంబర్ 9 న బంగ్లాను బదిలీ చేసినట్లు తెలుస్తోంది. స్టాంప్ డ్యూటీగా రూ.50.65 లక్షలు కూడా చెల్లించారు. అమితాబ్ కొడుకు అభిషేక్, నటి ఐశ్వర్య వివాహ వేడుకలు ‘ప్రతీక్ష’ బంగ్లాలో జరిగాయి. ఇదే ప్రాంతంలో ఉన్న ‘జనక్’ అనే ఇంటిని అమితాబ్ ఆఫీసు కోసం వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. అమితాబ్ తన గారాల తనయ శ్వేత నందకు బహుమతిగా అన్ని కోట్ల ఆస్తిని ముట్టచెప్పడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

