కొన్ని సినిమాల పేరు చెప్పగానే నెక్స్ట్ పార్ట్ ఎప్పుడొస్తుంది అన్న క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో ఉంటుంది. ఇటీవల మన సినిమాలు హాలీవుడ్ సిరీస్ లకు పోటీగా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇండియాన్ సినిమా క్రేజ్ ఏంటో ఇప్పటికే హాలీవుడ్ కు అర్ధమైపోయింది. మనదగ్గర అన్ని సినిమాలు సక్సెస్ కాకపోయినా కొన్ని సినిమాలకు అలా ఫ్యాన్ బేస్ ఉంటుందంతే. మన ఇండియన్ సినిమాల్లో క్రిష్(Krrish )ఫ్రాంచైజీకి ఉన్నట్టు. క్రిష్ పేరు చెప్పగానే నెక్స్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ ఎప్పుడనే ఆలోచన మీక్కూడా వచ్చేసిందా? యస్.. ఇప్పుడు క్రిష్ ఫ్యాన్స్ అందరి ఎదురుచూపులూ నెక్స్ట్ మూవీ అనౌన్స్ మెంట్ కోసమే. క్రిష్3 అప్పుడెప్పుడో 2013లో విడుదలైంది. అప్పటి నుంచి క్రిష్ 4 గురించి రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు వాటికి ఇంకొంచెం స్పైస్ యాడ్ అయింది. రీసెంట్‌గా బ్రహ్మాస్త్ర సీక్వెల్లో నటించే ఆఫర్‌ని రిజక్ట్ చేసిన హృతిక్, తన క్రిష్4 మీద కాన్‌సెన్‌ట్రేట్ చేస్తున్నారట.
అయితే క్రిష్4 డైరక్షన్‌ని మాత్రం రాకేష్ రోషన్‌కి ఇచ్చే ఆలోచన లేదట హృతిక్‌కి. క్రిష్ సబ్జెక్ట్ కి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు వాళ్ల అంచనాలకు తగ్గట్టు సినిమా చేయాలంటే కచ్చితంగా జెన్ నెక్స్ట్ వెర్షన్ ని రెడీ చేయాలి. అలా చేయాలంటే నయా డైరక్టర్ అయితే బెటర్ అనుకుంటున్నారట బాలీవుడ్ గ్రీక్ గాడ్. ఆ విషయాన్నే రాకేష్ రోషన్‌తోనూ హృతిక్ డిస్కస్ చేశారని, యంగ్ అండ్ ఎనర్జిటిక్ డైరక్టర్ అయితే ప్రాజెక్ట్ కి ప్లస్ అవుతుందని భావిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ రాకేష్ ఒప్పుకుంటే, క్రిష్ మోడ్రన్ వెర్షన్‌ని జనాల కోసం క్రియేట్ చేసే కేపబుల్ కెప్టెన్ ఎవరై ఉంటారనే చర్చ కూడా జోరుగా నడుస్తోంది. చూడాలి మరి ఏంజగుతుందో..
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.