Tollywood: ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా ?.. అలనాటి విశ్వ సుందరి కూతురు.. అచ్చం తల్లిలాగే..

|

Dec 16, 2023 | 5:26 PM

అలనాటి విశ్వసుందరి కూతురు.. స్టార్ హీరో వారసురాలు. తల్లిదండ్రులు.. తాతయ్య, నానమ్మ అందరూ ఫేమస్ సెలబ్రెటీలు కావడం విశేషం.ఈ చిన్నారి కుటుంబానికి నార్త్ టూ సౌత్ అత్యధిక అభిమానులు ఉన్నారు. ఎప్పుడూ తల్లి చేయి పట్టుకుని కనిపించే ఆ చిన్నారి.. తొలిసారి తన స్కూల్ వార్షిక దినోత్సవ వేడుకలలో నాటక ప్రదర్శనలో అదరగొట్టేసింది. అందంలోనే కాదు.. నటనలోనే తల్లిని మించి పోయింది. ఎవరో గుర్తుపట్టారా ?..

Tollywood: ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా ?.. అలనాటి విశ్వ సుందరి కూతురు.. అచ్చం తల్లిలాగే..
Actress
Follow us on

పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయిని గుర్తుపట్టారా ?.. పాన్ ఇండియా ప్రేక్షకులకు అత్యంత సుపరిచితమైన అమ్మాయి. అలనాటి విశ్వసుందరి కూతురు.. స్టార్ హీరో వారసురాలు. తల్లిదండ్రులు.. తాతయ్య, నానమ్మ అందరూ ఫేమస్ సెలబ్రెటీలు కావడం విశేషం.ఈ చిన్నారి కుటుంబానికి నార్త్ టూ సౌత్ అత్యధిక అభిమానులు ఉన్నారు. ఎప్పుడూ తల్లి చేయి పట్టుకుని కనిపించే ఆ చిన్నారి.. తొలిసారి తన స్కూల్ వార్షిక దినోత్సవ వేడుకలలో నాటక ప్రదర్శనలో అదరగొట్టేసింది. అందంలోనే కాదు.. నటనలోనే తల్లిని మించి పోయింది. ఎవరో గుర్తుపట్టారా ?.. తనే బాలీవుడ్ బ్యూటీ, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ గారాలపట్టి ఆరాధ్య బచ్చన్. 12ఏళ్ల ఆరాధ్య బచ్చన్ ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుతోంది. చదువులో చాలా నిష్ణాతులైన ఆరాధ్య .. అప్పుడప్పుడు సినిమా కార్యక్రమాలకు తండ్రి అభిషేక్, తల్లి ఐశ్వర్య, తాత అమితాబ్‌తో హాజరవుతుంటుంది.

తల్లి ఐశ్వర్యరాయ్ మాదిరిగానే ఆరాధ్య సైతం ఎంతో క్యూట్‏గా కనిపిస్తుంది. సినిమా ఈవెంట్లలో కుటుంబంతో కలిసి బయటకు వచ్చే ఆరాధ్య ఎప్పుడూ తన తల్లి ఐశ్వర్య చేయి పట్టుకుని కనిపిస్తుంది. గతంలో ఆమెపై అనేక ట్రోలింగ్స్ జరగడంతో అభిషేక్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన కూతురి గురించి ట్రోలింగ్ జరగడంపై సీరియస్ అయ్యాడు. అంతేకాదు.. తన పై వచ్చే విమర్శలను.. ట్రోలింగ్ వీడియోలను ఆపాలంటూ అప్పుడే ఆరాధ్య హైకోర్టును ఆశ్రయించింది. చదువులో ముందుండే ఆరాధ్య.. ఇటు కబడ్డీ, ఆటలలోనూ ఆసక్తి చూపిస్తుంటుంది.

ఇటీవల జరిగిన ధీరుబాయ్ అంబానీ ఇంటర్నెషనల్ స్కూల్ వార్షిక దినోత్సవ వేడుకలలో ఆరాధ్య స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆమెకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. అందులో ఆరాధ్య నల్లటి దుస్తులు ధరించి.. చాలా అందంగా.. కనిపిస్తూ ఇంగ్లీష్ లో డైలాగ్స్ చెబుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్.. ఆరాధ్య అచ్చం ఐశ్వర్యలాగే కనిపిస్తుందని.. నటనలో తల్లిని మించిపోవడం ఖాయమంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.